AP Politics : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉండేంత హై డ్రామా, ఏ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలోనూ ఉండదేమో. 2014లో రాష్ట్ర విభజన జరిగినా ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు. టీడీపీ ప్రభుత్వం, అమరావతిని ఏపీ రాజధానిగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించినా, రెండోసారి ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీ గెలవడంతో సీన్ మారింది. మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి తెచ్చిన జగన్, ఉన్న దాన్ని, ఉంచుకున్న దాన్ని రెండింటినీ చెడగొట్టేశాడు..
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ రాజధాని చుట్టూ రాజకీయం సాగిస్తున్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలిస్తే అమరావతిని తిరిగి ఏపీ రాజధానిగా చేస్తామని ప్రకటించాయి. ఇప్పటికే శంకుస్థాపన జరిగి, సగం పనులు పూర్తి అయిన భవనాల పనులు తిరిగి ప్రారంభం అవుతాయి..
YS Jagan : జగన్‌కి ఓటమి తప్పదా? ఏపీలో పరిస్థితి ఎలా ఉంది..
వైఎస్ఆర్‌సీపీ గెలిస్తే, వైజాగ్ సిటీని ఏపీ రాజధానిగా చేస్తామని ప్రకటించింది. ఐదేళ్లు రాజధాని లేకుండా పాలించిన జగన్, ఎన్నికల ముందు వైజాగ్ సిటీ క్యాపిటల్ ప్రస్తావన తెచ్చి, సీమాంధ్ర ఓట్లపై కన్నేశాడు. తెలంగాణ నుంచి ఏపీకి మకాం మార్చిన వైఎస్ షర్మిల, కాంగ్రెస్ పార్టీని ఏపీలో అధికారంలోకి తెస్తే తిరుపతి నగరాన్ని, ఏపీకి రాజధానిగా చేస్తామంటూ కొత్త ప్రతిపాదన తెచ్చింది.
రాయలసీమ ఓట్లపై కాంగ్రెస్, కోస్తా ఆంధ్ర ఓట్లపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, అమరావతిలో భూములు కొన్న హైదరాబాద్‌లో సెటిలైన ఆంధ్రుల ఓట్లపై టీడీపీ కూటమి చూపించే ప్రభావమే ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేయనుంది.