AP Politics : పాలిటిక్స్‌లో సింపథీని మించిన బ్రహ్మాస్త్రం లేదు. 2019లో జగన్‌పై జరిగిన కోడి కత్తి దాడి, ఆయన్ని సీఎంని చేసింది. ఇప్పుడు 2024 ఏపీ ఎన్నికల ముందు కూడా సింపథీ కోసం రాజకీయ నాయకులపై రాళ్ల దాడులు చేస్తున్నారు అభిమానులు. జగన్‌పైన జరిగిన రాయి దాడి మరవకముందే 24 గంటల గ్యాప్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై కూడా రాయి దాడి జరిగింది.
విశాఖపట్నంలోని పాత గాజువాక జంక్షన్లో ప్రచారం చేస్తున్న చంద్రబాబుపైకి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. అయితే ఆ రాళ్లు చంద్రబాబుకి తగలకపోవడంతో ప్రమాదం తప్పింది. అలాగే గుంటూరు జిల్లా తెనాలిలో ప్రచారం చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పైకి రాయి విసిరాడు ఓ వ్యక్తి. అయితే ఆ రాయి, పవన్‌కి తగలకుండా పక్కనుంచి వెళ్లిపోయింది.
YS Jagan : అప్పుడు కోడి కత్తి! ఇప్పుడు రాయి దాడి..
దాన్ని గమనించిన జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, ఆ రాయి వేసిన వ్యక్తిని పట్టుకున్నారు. చితకబాది, పోలీసులకు అప్పగించారు. అతను మాత్రం తాను పవన్ కళ్యాణ్ వీరాభిమానిని అంటూ ప్రకటించుకోవడం ఇక్కడ ట్విస్టు. సింపథీ వస్తుందని రాజకీయ నాయకులపై రాళ్ల దాడి చేయడం మొదలెట్టడంతో వ్యవహారం మున్ముందు ఎటు వెళ్తుందో, ఏపీ పాలిటిక్స్‌లో ఇంకా ఎలాంటి దారుణాలు చూడాల్సి వస్తుందో మరి..