AP Government : భారత్‌లో జనాలు అభివృద్ధి కంటే ఎక్కువగా సంక్షేమ పథకాలనే కోరుకుంటారు. ఆర్థికాభివృద్ధి, స్థూల జాతీయోత్పత్తి పెంచుతామని చెప్పే వారికి పది ఓట్లు కూడా పడవు. అదే ఫ్రీగా కరెంట్ ఇస్తాం, ఫ్రీగా బియ్యం ఇస్తామని పథకాల పేరు చెబితే చాలు.. బంపర్ మెజారిటీ వచ్చేస్తుంది. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది.తెలంగాణ ఎన్నికలు ముగిసిన నాలుగు నెలలకు ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి.
పార్లమెంట్‌లోకి చొరబడిన ఇద్దరు దుండగులు.. టియర్ గ్యాస్ రిలీజ్ చేసి..
రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెట్టిన ఏపీ ప్రజలు, ఆ తర్వాతి ఎన్నికల్లో వైఎస్ జగన్‌కి అధికారం ఇచ్చారు. అయితే గడిచిన నాలుగేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, ఎక్కడ కనిపించలేదు.అదీకాకుండా అమరావతిని రాజధానిగా చేయాలని తెలుగుదేశం ప్రభుత్వం మొదలెట్టిన పనులను కూడా జగన్ సర్కార్ పూర్తిగా పక్కనబెట్టేసింది.
మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చి, తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న వైఎస్‌ఆర్ సీపీ, ప్రస్తుతం వైజాగ్‌ని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మార్చాలని చూస్తోంది.ఎన్నికలకు ముందు ప్రజల్లో పెరిగిపోయిన అసంతృప్తిని తగ్గించేందుకు సంక్షేమ పథకాల, అభివృద్ధి పేరుతో హడావుడి చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే పేదల కోసం 7.43 లక్షల పట్టా ఇళ్లను జగన్ సర్కార్, పంపిణీ చేయబోతుందని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఇప్పటికే ఈ ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యిందని కూడా కొన్ని ఇన్‌స్టా పేజీలు ప్రమోషన్ చేస్తున్నాయి.
రిపబ్లిక్ డే వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ వచ్చేది కష్టమే..!
అయితే ఆ 7 లక్షల 43 వేల ఇళ్లను ఎక్కడ కట్టారు? ఎప్పుడు పంపిణీ చేస్తారు? ఎలక్షన్ల తర్వాత? ఎలక్షన్ లోపేనా? అనేది మాత్రం తెలియరాలేదు. అలాగే తాజాగా వైజాగ్‌లో ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్‌ని తెరిచింది జగన్ సర్కార్. దీని ద్వారా దాదాపు 1000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించబోతున్నారు.అలాగే రూ.3008 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 13 ప్రాజెక్ట్స్ ఏపీకి వచ్చాయని, వీటి ద్వారా వేల ఉద్యోగాలు రాబోతున్నాయని కూడా జగన్ ప్రకటించారు.
సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్లు.. ఎలక్షన్‌లో 2 వేల ఓట్లు..!
అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో వృద్ధులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించబోతున్నారని, 172 రకాల మందులను కూడా ఫ్రీగా ఇస్తారని ప్రకటించారు. సరిగ్గా ఎన్నికలకు 3 నెలల ముందు జగన్ వరుసగా చేస్తున్న పథకాల ప్రకటనలు, ప్రాజెక్ట్‌ల అనౌన్స్‌మెంట్లు.. గడిచిన నాలుగున్నరేళ్లలో ఎందుకు రాలేదనేది సగటు ఆంధ్రుడి అనుమానం.. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విషయంలో బాగా వర్కవుట్ అయిన సంక్షేమం, జగన్ విషయంలోనూ వర్కవుట్ అవుతుందా? లేదా? తెలియాలంటే ఏపీ ఎలక్షన్స్ రిజల్ట్ వరకూ వేచి చూడాల్సిందే.