AP Election 2024 : ప్రజలకు సేవ చేయడమే రాజకీయ నాయకుల ప్రధాన కర్తవ్యం. అయితే ఇప్పుడు కేవలం అధికారం చేతిలో తీసుకోవడానికి మాత్రమే రాజకీయాల్లోకి వస్తున్నారు, నాయకులమని చెప్పుకుంటున్నారు. ఇలా అధికారమదం తలకెక్కించుకున్న ఓ ఎమ్మెల్యే, లైన్‌లో రమ్మన్నందుకు ఓటరుపై చేయి చేసుకున్నారు. కొట్టింది ఎమ్మెల్యే అయితే ఏంటి? ఎంపీ అయితే ఏంటి? తిరిగి ఆలోచించకుండా ఆ ఎమ్మెల్యేపై చేయి చేసుకున్నాడు ఆ ఓటరు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ పోలింగ్‌లో హాట్ టాపిక్ అయ్యింది.
Free Bus Effect : అమ్మకానికి హైదరాబాద్ మెట్రో..!
గుంటూరు జిల్లా తెనాలిలో వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, ఓటు వేసేందుకు తన వర్గంతో కలిసి ఓటింగ్ కేంద్రానికి వచ్చాడు. అప్పటికే ఆ ఓటింగ్ కేంద్రంలో చాలామంది ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్నారు. దీన్ని పట్టించుకోకుండా శివకుమార్, నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు చూశారు. దీంతో అక్కడే ఉన్న ఓ ఓటర్, ‘క్యూలో రావాలంటూ’ నిలదీశాడు.
దీంతో ‘నేను ఎమ్మెల్యేని, నన్నే క్యూలో రమ్మంటావా’ అనుకున్నాడో ఏమో, శివకుమార్ ఆ ఓటర్ చెంపను చెల్లుమనిపించాడు. దీంతో ఆ ఓటర్ కూడా తిరిగి ఎమ్మెల్యే చెంపపై కొట్టాడు. దీంతో అన్నాబత్తుని శివకుమార్ షాక్‌తో అలా నిలబడిపోయాడు. అతనితో వచ్చిన ముఠా మాత్రం ఆ ఓటరుపై విచ్చక్షణారహితంగా దాడి చేసింది. ఇంత జరుగుతున్నా పోలీసులు కల్పించుకోకపోవడం విశేషం. అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొనడంతో కాసేపు పోలింగ్ నిలిచిపోయింది.