AP Election 2024 : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్, మే 13న జరగనున్నాయి.. ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ లోక్సభ ఎన్నికలకు మే 13న పోలింగ్ జరగనుంది. ఆ రోజు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా కార్మికులకు, ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మిక శాఖ కమిషనర్ శేషగిరి బాబు ఆదేశాలను జారీ చేశారు. ఈ నిబంధన ఉల్లంఘిస్తే యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సెలవు ఇచ్చినందుకు జీతంలో ఎలాంటి కటింగ్ ఉండకూడదని సూచించారు. పోలింగ్ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే సెలవు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం..
ఎన్నికల్లో మీరు పోలింగ్ బూత్ కి వెళ్లేసరికి అక్కడ మీ ఓటు లేకపోయినా లేదా ఓటర్ లిస్టులో మీ పేరు గల్లంతైన.. మీ ఓటర్ కార్డ్ లేదా ఆధార్ కార్డు చూపించి సెక్షన్ 49A క్రింద ఛాలెంజ్ ఓటు వేయొచ్చు.. అలాగే ఒకవేళ మీ ఓటు అప్పటికే ఎవరైనా వేసినట్లయితే… దొంగ ఓటును ఛాలెంజ్ చేస్తూ TENDERED Vote వెయ్యొచ్చు..
Importance of NOTA : నోటాకు ఓటేస్తే.. ప్రయోజనం ఏంటి..!?
ఇలా ఏ బూతులో అయిన 14% దాటి ‘టెండర్ ఓట్లు’ పోల్ అయితే అక్కడ రీ- పోలింగ్ జరుగుతుంది. అంటే ఇంతకుముందులా దొంగ ఓట్లతో గెలిచేద్దాం అనుకునే నాయకులకు ఈ టెండర్ ఓట్లతో చెక్ పెట్టబోతోంది ఎలక్షన్ కమిషన్. అయితే ఓటు వేయడానికి ఓటర్లు పోలింగ్ బూత్ దాకా వచ్చినప్పుడే ఇది సాధ్యపడుతుంది. ఎన్నికల్లో అక్రమాలను అరికట్టడానికి పౌరులుగా మన వంతు బాధ్యతను మనం నిర్వహిద్దాం. ఈసారైనా మన ఓటుని నిజాయితీపరులైన నాయకులకి వేద్దాం.
ఎలక్షన్ బూత్ స్లిప్స్ కోసం ECI అని టైపు చేసి స్పేస్ ఇచ్చి మీ ఓటర్ ఐడి సంఖ్యను 1950 నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు 15 సెకన్లలో ఎలక్షన్ బూత్ నుంచి స్లిప్ వస్తుంది..