Animal vs Maharaja: రణ్‌బీర్ చేస్తే తిట్టారు.. ‘మహారాజ’ మూవీలో విజయ్ సేతపతి చేస్తే..

Animal vs Maharaja
Animal vs Maharaja

Animal vs Maharaja : రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టైంది. కానీ విమర్శకుల నుంచి, సినీ ఇండస్ట్రీ నుంచి ఈ సినిమా మీద వచ్చినన్ని ట్రోల్స్.. బహుశా ఏ సినిమా మీద వచ్చి ఉండవేమో.. ‘యానిమల్’ మూవీలో చూపించిన హింసాత్మక సన్నివేశాలు కూడా భయమేసిందని, ‘అల్ఫా మేల్’ పేరుతో మరీ హింసాత్మక సన్నివేశాలు చూపించారని అన్నారు.

మరీ ముఖ్యంగా తన అన్న బాబీ డియోల్‌ని క్లైమాక్స్‌లో అతి క్రూరంగా గొంతు కోసి చంపే సీన్ చూసి జనాలు భయపడ్డారు. మరీ ఇంత క్రూరంగా చిత్రీకరించాల్సిన అవసరం లేదని చాలామంది ఫీల్ అయ్యారు. ‘మహారాజ’ మూవీలో కూడా ఇలాంటి సీన్ ఒకటి ఉంటుంది. అయితే ఈ సినిమాపై ఎలాంటి విమర్శలు రాలేదు. ఎందుకంటే ‘మహారాజ’ మూవీలో ఎమోషన్స్ అద్భుతంగా వర్కవుట్ అయ్యాయి. ఎంతగా అంటే చూసే జనాలు కూడా అక్కడ అంతకంటే క్రూరంగా చంపాలని ఫీల్ అవుతారు..

Vijay Sethupathi – Trisha : క్లైమాక్స్‌లో త్రిషతో లిప్‌లాక్ రాసుకున్న డైరెక్టర్.. హీరో ఏం చేశాడంటే..

‘యానిమల్’ విషయానికి వస్తే అక్కడ అంత క్రూరంగా చంపడానికి కారణాలు ఏమీ ఉండవు. ఏదో హీరోయిజం చూపించాలని డైరెక్టర్ చూపించిన పైత్యం తప్పితే! ‘మహారాజ’ మూవీలో ఎమోషన్స్ ఎంత వర్కవుట్ అయినా కొన్ని సీన్స్.. ప్రేక్షకులు ఇబ్బందిపడతారని చూపించకుండా వదిలేశారు. అక్కడే ‘మహారాజ’ డైరెక్టర్ నిథిలన్ సామినాథన్ ఓ మెట్టు ఎక్కేయగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన పైత్యం చూపించి, ట్రోల్స్ ఫేస్ చేశాడు.

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post