Animal Movie : కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద హిట్ అయినా, అందరికీ నచ్చవు. ‘యానిమల్’ కూడా అలాంటిదే. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీసిన ‘యానిమల్’ బాలీవుడ్‌లో వండర్స్ క్రియేట్ చేస్తోంది. తెలుగులో డబ్బింగ్ వర్షన్ కూడా భారీ లాభాలు తెచ్చిపెట్టింది.. అయితే సినిమాపై విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది..
నేను, మీ ఇద్దరి కాళ్లు నాకుతాను!.. ఆర్జీవీ, ‘యానిమల్’ రివ్యూ చదవితే..
సినిమా చివరి 45 నిమిషాల్లో వచ్చిన బాబీ డియోల్, తన నటనతో అందర్నీ ఇంప్రెస్ చేశాడు. అయితే తన తల్లికి మాత్రం ‘యానిమల్’ మూవీ అస్సలు నచ్చలేదట. ‘నేను, మమ్మీ కలిసి ఈ మూవీ చూశాం. మమ్మీకి ఈ మూవీ అస్సలు నచ్చలేదు. లాస్ట్‌లో నన్ను చంపే విధానం చూసి అస్సలు తట్టుకోలేకపోయింది. ఇలాంటి చెత్త సినిమాలు చేయకని చెప్పింది. అయితే ఆమె ప్రేమ నేను అర్థం చేసుకోగలను. ఈ మూవీ నాకు పెద్ద టర్నింగ్ పాయింట్ అయ్యింది.’ అంటూ కామెంట్ చేశాడు బాబీ డియోల్..
ఈ ‘ప్రయాణం’ ఆగేదెప్పుడు? షమీని పెళ్లాడతానంది, ఇప్పుడేమో పఠాన్‌ని ప్రేమించానంటూ..
ప్రస్తుతం బాబీ డియోల్ చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్‌తో ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తున్న బాబీ డియోల్, బాలకృష్ణ- బాబీ కాంబోలో వస్తున్న NBK109 చిత్రంలోనూ నటిస్తున్నాడు. అలాగే కోలీవుడ్‌లో సూర్య ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువా’ మూవీలోనూ బాబీ డియోల్ విలన్ నటిస్తున్నాడు.