Anemia Causes, Symptoms, Diet and Treatment : ఈ రోజుల్లో చాలామందిని, ముఖ్యంగా మహిళలను వేధించే సమస్య రక్తహీనత (Anemia). రక్తహీనత అనేది శరీరంలో రక్తం తక్కువగా ఉండటం ద్వారా వచ్చే వ్యాధి. ఇది బలమైన ఆహారం తీసుకోకపోవడం ద్వారా వస్తుంది. చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, మలేరియా లాంటి తీవ్ర జ్వరాలు, వ్యాధులు కలిగిన వారిలో ఈ రక్త హీనత ఎక్కువగా కనిపిస్తుంది. రక్తహీనత వలన తలనొప్పి, నెలసరిగా సరిగా రాకపోవడం, ఒకవేళ వచ్చినా హెవీ పెయిన్, కళ్ళు తిరగడం, కాళ్ళు చేతులు లాగడం లాంటి అనేక సమస్యలు వస్తాయి.
మనం తీసుకునే ఆహారంలో ఐరన్ (Iron) తగ్గితే, హిమోగ్లోన్ (Hemoglobin) తగ్గుతుంది. దీంతో ఎర్ర రక్తకణాలు తగ్గి, రక్తంలో శక్తి తగ్గుతుంది. తద్వారా ఆక్సిజన్ సప్లై కూడా తగ్గిపోతుంది. హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు బయటికి పెద్దగా లక్షణాలు కనిపించవు. అలసట, నీరసం, తరచూ తలనొప్పి, చర్మం పాలిపోయినట్టు ఉండడం వంటి లక్షణాలుంటాయి. బ్లడ్ రిపోర్టులో హిమోగ్లోబిన్ లెవెల్ స్పష్టంగా తెలుస్తుంది.
మగవాళ్లకు 13.5 నుండి 17.5 వరకు, ఆడవాళ్లకు 12 నుండి 15.5 వరకు నార్మల్ లెవెల్స్. అంతకంటే తక్కువ ఉంటే బ్లడ్ లో ఐరన్ తక్కువ ఉన్నట్టే.. వెంటనే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ఆహార అలవాట్లు, లివర్ ప్రాబ్లం పీరియడ్స్ లో హెవీ బ్లీడింగ్, మూత్రపిండాల సమస్య, లుకేమియా, తలసేమియా వంటి సమస్యల వల్ల కూడా రక్తం తగ్గిపోవచ్చు.
రెస్టారెంట్ స్టైల్లో చికెన్ 65..
రక్తం పెరగాలంటే.. (Blood Improvement) :
ఉదయాన్నే మూడు అంజీర ఫ్రూట్స్ శుభ్రంగా కడిగి ఓ గంట నానబెట్టండి. నానిన పండు పొట్టు తీసి తినండి. అలాగే అది నానబెట్టిన వాటర్ కూడా తాగండి. మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక దానిమ్మకాయ గింజలు తినండి. సాయంత్రం రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తీసుకోవాలి. లేదా క్యారెట్, బీట్రూట్ కలిపి అయినా జ్యూస్ చేసుకొని తాగొచ్చు. వీటి వల్ల బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది.
అయితే కొంతమందికి ఇలా తీసుకోవడం వీలుకాదు. డయాబెటిక్ ఉన్నవాళ్లు, జలుబు, దగ్గు, అస్తమా సమస్యలు ఉన్నవాళ్లు ఇలా తీసుకోవడం కుదరదు. ఈ పద్ధతి పాటించడం కుదరని వాళ్ళు హిమోగ్లోబిన్ ను పెంచుకోవడానికి మరో మార్గం కూడా ఉంది. ఈ విధానాన్ని అందరూ ఫాలో కావొచ్చు. షుగర్ పేషెంట్స్ కి కూడా ఇది ఎంతో ఉపయోగం.
గోధుమ గడ్డి జ్యూస్ :
ఉదయం, సాయంత్రం తినడానికి గంట ముందు గోధుమ గడ్డి చూర్ణాన్ని గోరువెచ్చని నీళ్లలో ఒక చెంచా కలుపుకొని తాగాలి. షుగర్ ఉన్నవాళ్లు డైరెక్ట్ గా తీసుకోవాలి లేని వాళ్ళు రెండు లేదా మూడు చెంచాలు స్వచ్ఛమైన తేనె కలుపుకోవచ్చు. ఈ జ్యూస్ ను గ్రీన్ బ్లడ్ (Green Blood) అంటారు. ఈ గోధుమ గడ్డి మీరే ఇంట్లో స్వయంగా పెంచుకోవచ్చు.