Anant Ambani Wedding Cost : రోజుకి రూ.1000 సంపాదించడానికి కూలీలు, రోజుంతా ఎండలో కష్టపడాల్సి ఉంటుంది. అలాంటిది పెళ్లి కోసం రూ.1000 కోట్లు ఖర్చు పెడితే, అది అపార కుబేర కుటుంబమే! కూతురు ఇషా అంబానీ పెళ్లి కోసం రూ.700 కోట్లు ఖర్చు చేసిన ముకేశ్ అంబానీ, ఇప్పుడు కొడుకు అనంత్ అంబానీ కోసం ఏకంగా వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ని మార్చి 3న వివాహం చేసుకోబోతున్నాడు. మార్చి 1 నుంచే పెళ్లి వేడుకలు మొదలైపోయాయి.
Kichha Sudeep Hairstyle : రూ.1 లక్ష పెడితే, రూ.2.75 కోట్లు వచ్చాయి! సినిమా వాళ్ల కథే వేరబ్బా..
హాలీవుడ్ పాప్ సింగర్ రిహానాతో పాటు బియాన్స్ కూడా ఈ వివాహ వేడుకలో పర్పామెన్స్ ఇవ్వబోతున్నారు. ఈ ఇద్దరి కోసమే దాదాపు రూ.80 కోట్లు ఖర్చు చేస్తోంది అంబానీ ఫ్యామిలీ. ఈ పెళ్లి కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలందరికీ ఆహ్వానం అందింది. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు ఈ పెళ్లి కోసం ముంబైకి చేరుకున్నారు.
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, ఫేస్‌బుక్ అధిపతి మార్క్ జుకర్‌బర్గ్, డిస్నీ సీఈవో బాబ్ ఇగర్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్, భూటాన్ కింగ్, ఖతర్ రాజులు.. ఇలా సెలబ్రిటీలంతా అంబానీ ఫ్యామిలీ వివాహ వేడుకకు హాజరు కాబోతున్నారు. వీరి కోసం 2500 ఫుడ్ ఐటెమ్స్ వడ్డించబోతున్నారు. ఒక్కసారి వండిన ఐటెమ్, మళ్లీ రిపీట్ కాకుండా మూడు రోజుల పాటు ప్రత్యేక వంటలను అతిథుల కోసం తయారుచేస్తున్నారు..
Cadbury Chocolate : Cadbury ఆరోగ్యానికి మంచిది కాదు! బాంబ్ పేల్చిన తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ..