Anant Ambani : అనంత్ అంబానీ పెళ్లికి ముందు రెండో ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్.. ఈసారి అన్నీ ఓడలోనే..
పెళ్లికి ముందు ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంటే డబ్బులు దండగ. అలాంటిది అప్పుడెప్పుడో జూలైలో జరగబోయే పెళ్లికి మార్చిలోనే రూ.700 కోట్లు ఖర్చు చేసి ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చేసింది అంబానీ ఫ్యామిలీ.
ఇప్పుడు పెళ్లికి నెల రోజుల ముందు మరోసారి ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం ఓ విలాసవంతమైన ఓడను సిద్ధం చేస్తున్నారు. ఇటలీ నుంచి బయలుదేరే ఈ ఓడ, ఫ్రాన్స్‌కి చేరుకునేదాకా ఓడలోనే ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి..
Samantha : అతన్ని గుడ్డిగా నమ్మి, మోసపోయా! సమంత కామెంట్స్ ఎవరి గురించి…?
4380 కి.మీలు ప్రయాణించే ఈ ఓడ ప్రయాణంలో అతిథుల కోసం ప్రపంచ వ్యాప్తంగా దొరికే అన్ని రకాల వంటలు సిద్ధంగా ఉంటాయి. అలాగే అతిథుల వినోదం కోసం ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి.
మార్చిలో జరిగిన అనంత అంబానీ ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో డ్యాన్స్ చేసిన బాలీవుడ్ ఖాన్ త్రయం, ఈ షిప్‌లో కూడా అతిథులను ఎంటర్‌టైన్ చేయబోతున్నారు..
షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ఇలా బాలీవుడ్ నుంచి అతి కొద్ది మంది ప్రముఖులకు మాత్రం ఈ ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కి ఆహ్వానం అందిందట. వీళ్లు కూడా డబ్బులు తీసుకుని, అతిథులను ఎంటర్‌టైన్ చేయడానికి ఈ షిప్పులో ఎక్కబోతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార వేత్తలతో పాటు 800 మంది సెలబ్రేటీలు ఈ ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో పాల్గొంటారు. ఈసారి కూడా దాదాపు రూ.800 కోట్ల వరకూ ఖర్చు చేయనుంది అంబానీ ఫ్యామిలీ. అంటే ఒక్కో గెస్టుకి ఒక్కో కోటి రూపాయలు ఖర్చు చేయబోతున్నారు.
ఈ ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ముగిసిన తర్వాత జూలై 10-12 తేదీల్లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం ఘనంగా జరగనుంది. మొత్తంగా ఈ పెళ్లి కోసం దాదాపు రూ.3 వేల కోట్ల వరకూ ఖర్చు చేస్తోంది అంబానీ ఫ్యామిలీ..
Anant Ambani Wedding Cost : అనంత్ అంబానీ పెళ్లి కోసం అన్ని కోట్లా.. సెలబ్రిటీలంతా అక్కడే..