Ambati Rambabu : పవన్ కళ్యాణ్ కూడా నాలా డ్యాన్స్ చేయలేడు..

Ambati Rambabu : ఏపీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. మంత్రిగా చేసిన అభివృద్ధి పనుల కంటే ఎక్కువగా ఆయన డ్యాన్సులే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్నాయి. ఇది తనకు ఎంతో గర్వకారణంగా ఉంటుందని అంటున్నారు అంబటి రాంబాబు..

‘నా డ్యాన్స్ చూసి, సినిమా ఫీల్డ్ వాళ్లు ఫోన్ చేసి చాలా సార్లు పొగిడారు. నాలా పవన్ కళ్యాణ్ కూడా డ్యాన్స్ చేయలేడు. డ్యాన్స్ చేయడంలో చిరంజీవి మాత్రమే నాకు పోటీ అని చాలామంది సినిమా వాళ్లు చెప్పారు…’ అంటూ చెప్పుకొచ్చాడు మంత్రి అంబటి రాంబాబు..

Pawan Kalyan : నా నాలుగో పెళ్లానివి నువ్వే..!

రాజకీయాల్లోకి రాకముందు కొన్ని సినిమాల్లో నటించాడు అంబటి రాంబాబు. అయితే అంబటి రాంబాబు ముఖ్య పాత్రలో నటించిన సినిమాలు, థియేటర్లలో విడుదల కాలేదు. చిన్న చిన్న పాత్రల్లో నటించిన సినిమాలు, థియేటర్లలో విడుదలైనా అంబటి రాంబాబుకి పెద్దగా గుర్తింపు రాలేదు. సినిమాల్లో సక్సెస్ కాలేకపోవడం వల్లే ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ సక్సెస్ అయ్యాడు.

By Dhana Sri

I'm Telugu content writer with 2 years of Experience. I can write any vertical articles but specialist in Cooking and Spiritual writing.

Related Post