Amazon Prime : ఒకప్పుడు ఓ సినిమా రిలీజ్ అయిన తర్వాత టీవీ రైట్స్ కోసం ఛానెళ్ల మధ్య పోటీ ఉండేది. ఇప్పుడు ఆ పోటీ ఓటీటీల మధ్య జరుగుతోంది. సినిమా రిలీజ్‌కి ముందే ఓటీటీ రైట్స్ కోసం పోటీ నడుస్తోంది. చాలా సినిమాలకు ఈ ఓటీటీ రైట్సే, లాభాలను తెచ్చిపెడుతున్నాయి కూడా.. పోటీ పెరుగుతూ పోతుండడంతో అమెజాన్ ప్రైమ్ వీడియో, తాజాగా ముంబైలో ఓ ఈవెంట్ నిర్వహించి ఏకంగా 60కి పైగా సినిమాల ఓటీటీ రైట్స్‌ని కొనుగోలు చేసినట్టు ప్రకటించింది.
Pawan Kalyan : సినిమాకి పొలిటికల్ రంగు! ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్లిప్స్ రిలీజ్..
రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరిహర వీరమల్లు’, విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’, నితిన్ ‘తమ్ముడు’, ‘ఓం భీం బుష్’, ‘గాటి’, ‘కంగువా’, ‘కాంతార చాప్టర్ 1’ సినిమాలతో పాటు హిందీలో 30కి పైగా సినిమాల రైట్స్‌ని సొంతం చేసుకున్నట్టు ప్రకటించింది అమెజాన్ ప్రైమ్.
ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ సీఈవో ఇండియాకి వచ్చి, టాలీవుడ్ కుటుంబాలను కలిసి, వారితో సినిమాల ఓటీటీ రైట్స్ గురించి చర్చించాడు. ఈ డిస్కర్షన్స్ కారణంగానే చాలా సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌కి వెళ్తున్నాయి. ఇలా అయితే సబ్‌స్కైబర్లను కోల్పోయే ప్రమాదం ఉందని గ్రహించిన అమెజాన్ త్వరగానే మేల్కొంది. మిగిలిన ఓటీటీలు కూడా రైట్స్ కోసం పోటీపడితే నిర్మాతలకు కాసుల పంటే. అయితే ఈ సొమ్మును తిరిగి రాబట్టేందుకు మూకుమ్మడి ఒప్పందంతో రేట్ల పెంచేసి, యూజర్ల నుంచి పిండి వసూలు చేసే ప్రమాదం కూడా లేకపోలేదు..