Allu Arjun’s Sympathy Drama : సింపథీ డ్రామా షురూ….

Allu Arjun's Sympathie drama : సింపథీ డ్రామా షురూ.. అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన యాడ్‌ని మహేష్ చేశాడంటూ..
Allu Arjun's Sympathie drama : సింపథీ డ్రామా షురూ.. అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన యాడ్‌ని మహేష్ చేశాడంటూ..

Allu Arjun : సింపథీ డ్రామా షురూ.. అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన యాడ్‌ని మహేష్ (mahesh) చేశాడంటూ..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అనవసరంగా కలిగించుకుని మరీ చిక్కుల్లో పడ్డాడు అల్లు అర్జున్. మేనమామ పవన్ కళ్యాణ్, ఏపీ ఎన్నికల్లో బరిలో దిగుతున్నాడని తెలిసి, ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి సపోర్ట్ తెలిపాడు అల్లు అర్జున్. నంద్యాల ఎమ్మెల్యేగా పోటీ చేసిన శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లి, హడావుడి చేశాడు బన్నీ. అల్లు అర్జున్‌ని చూడడానికి వెలాదిగా అభిమానులు తరలివచ్చారు. అయితే హీరోలను చూడడానికి వచ్చిన వారంతా ఓటు వేయరు. ఇది మరోసారి నిరూపిస్తూ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, 13 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు..

అల్లు అర్జున్ రాగానే “మెగా మేనల్లుడి” సపోర్ట్ మా పార్టీకేనంటూ పోస్టర్లు కూడా అతికించారు వైసీపీ కార్యకర్తలు. ఈ పరాజయం తర్వాత అల్లు అర్జున్‌పై తీవ్రమైన ట్రోలింగ్ వచ్చింది. అటు వైసీపీ కార్యకర్తలు, ఇటు కూటమి నేతలు, పవన్ కళ్యాణ్ అభిమానులు.. అల్లు అర్జున్‌ని తీవ్రంగా ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఈ సమయంలో బన్నీ పీఆర్ టీమ్ సానుభూతి క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది.

మహేష్ బాబు ఓ పాన్ మసాలా యాడ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పాన్ మసాలా యాడ్ చేయాలని సదరు కంపెనీ, అల్లు అర్జున్‌కి రూ.10 కోట్లు ఆఫర్ చేసిందట. అయితే ప్రజల ఆరోగ్యానికి హానీ చేసే యాడ్ చేయడం తనకు ఇష్టం లేదని, బన్నీ ఈ ఆఫర్‌ని రిజెక్ట్ చేశాడట. అలా అల్లు అర్జున్ చేయల్సిన యాడ్, మహేష్ చేశాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజం లేదు. ఎందుకంటే టాలీవుడ్‌లో బ్రాండ్ ప్రమోషన్స్‌లో మహేష్ ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. A-Z వరకూ ప్రతీ alphabet తో మొదలయ్యే బ్రాండ్లన్నింటికీ (మధ్యలో ఒకటి రెండు మినహా)  మహేష్అంబాసిడర్‌గా ఉన్నాడు..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post