Allu Arjun Vs Ram Charan : బన్నీ ఫాలోయింగ్ ముందు తేలిపోయిన చెర్రీ క్రేజ్..

Allu Arjun Vs Ram Charan : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి, టైర్ 1 హీరోలుగా మారారు అల్లు అర్జున్, రామ్ చరణ్. రామ్ చరణ్ కెరీర్‌లో ‘మగధీర’, ‘RRR’ వంటి ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి. అల్లు అర్జున్ ఇప్పటిదాకా ఇండస్ట్రీ హిట్టు కొట్టకపోయినా యూట్యూబ్ డబ్బింగ్ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్ తెచ్చుకున్నాడు. ‘RRR’ సక్సెస్ తర్వాత రామ్ చరణ్‌కి ‘గ్లోబల్ స్టార్’ ట్యాగ్ తగిలించారు మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్. స్ట్రైలిష్ స్టార్‌గా ఉన్న బన్నీ, ‘పుష్ప’ తర్వాత ‘ఐకాన్ స్టార్’గా మారాడు.. ఈ ఇద్దరిలో ఎవరికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ..

Mega Family : మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న అల్లు ఫ్యామిలీ..

బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురానికి వెళ్లాడు రామ్ చరణ్. ఇదే సమయంలో నంద్యాలలో స్నేహితుడి ఇంట్లో ప్రత్యేక్షమయ్యాడు అల్లు అర్జున్.. బన్నీని చూడడానికి జనం తండోపతండాలుగా కదిలివచ్చారు. ఆ ఏరియా అంతా జనసందోహంతో నిండిపోయింది. ఇదే సమయంలో రామ్ చరణ్‌‌ వచ్చినప్పుడు కానీ, ప్రేక్షకులకు అభివాదం చేసినప్పుడు కానీ ఈ రేంజ్‌లో జనాలు కనిపించలేదు. రామ్ చరణ్ కారు ఎక్కేందుకు వెళ్లే సమయంలో ఫ్యాన్స్, ఆయన్ని పట్టుకుని లాగేయాలని చూడడం తప్ప.. చెర్రీ ఎంట్రీకి అదిరిపోయే రెస్పాన్స్ అయితే దక్కలేదు..

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకే తెరతీశారు. అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు, రామ్ చరణ్ క్రేజ్ అస్సలు మ్యాచ్ కాదంటూ పోస్టులు పెడుతున్నారు బన్నీ ఫ్యాన్స్. ఈ మాత్రం దానికి ‘గ్లోబల్ స్టార్’ అనడం కరెక్ట్ కాదంటూ ట్వీట్లు చేస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ ఎంట్రీతో వైసీపీ కార్యకర్తలు, బన్నీ ఫోటోలను జోడించి.. వైఎస్ఆర్ సీపీకి ఓట్లు వేయాలంటూ పోస్టులు అతికించడం మొదలెట్టారు. దీంతో అటు నంద్యాలతో వైసీపీ అభ్యర్థికి, ఇటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కి వచ్చే మెజారిటీ.. వీరిద్దరికీ ఉన్న క్రేజ్‌ని డిసైడ్ చేయనుంది..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post