Allu Arjun – Pawan Kalyan : మెగా ఫ్యామిలీ నుంచి డజను మంది హీరోలు వచ్చారు. వీరిలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వారిలో అల్లు అర్జున్ ముందుంటాడు. వరుసకి పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్‌కి మామయ్య అవుతాడు. అయితే బన్నీ మాత్రం పవన్ కళ్యాన్ బాబాయ్ అని పిలుస్తాడు. పవన్ కళ్యాణ్ బర్త్ డే సమయంలో విషెస్ చేస్తూ ‘పవన్ కళ్యాణ్ బాబాయ్’ అనడం, ‘పంజా’ మూవీ సమయంలోనూ ‘కళ్యాణ్ బాబాయ్’ అంటూ ట్వీట్ చేశాడు అల్లు అర్జున్.
పెదనాన్నని డాడీ అనడం, తండ్రిని నాన్న అనడం చాలా కామన్. అయితే అసలు మామయ్య, బాబాయ్ ఎలా అయ్యాడు? దీనికి కారణం రామ్ చరణ్, అల్లు శిరీష్, అల్లు అర్జున్ ముగ్గురూ కూడా కలిసి ఒకే దగ్గర పెరిగారు. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్‌ని బాబాయ్ అని పిలవడంతో బన్నీ, శిరీష్‌లకు కూడా బాబాయ్ అనడమే అలవాటైపోయింది.
Pawan Kalyan OG : ఆ ఇద్దరు హీరోలతో పోటీ పడుతున్న పవర్ స్టార్..
అంతేకాదు వరుసకి బావమరిది అయినా సరే, అల్లు అర్జున్, రామ్ చరణ్‌ని తమ్ముడూ అని పిలుస్తుంటాడు. ఇది మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య బాండింగ్ ఎఫెక్ట్.. అయితే ఎన్టీఆర్, అల్లు అర్జున్ మాత్రం ఒకరినొకరు ‘బావ, బావ’ అని పిలుచుకుంటూ ఉంటారు.. బన్నీకి విష్ చేస్తూ ఎన్టీఆర్, ‘అల్లు అర్జున్ బావ’ అంటూ ట్వీట్ చేశాడు కూడా..