Allu Arjun : స్నేహితుడి కోసం నంద్యాలకి వచ్చిన టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఈ సమయంలో తన స్నేహితుడు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి కోసం అతని ఇంటికి, భార్య స్నేహారెడ్డితో కలిసి వెళ్లాడు అల్లు అర్జున్. తాను ఏ పార్టీకి చెందినవాడిని కాదని, కేవలం శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తనకు ఆప్తమిత్రుడు కావడం వల్లే ఇక్కడికి వచ్చినట్టు ప్రకటించాడు అల్లు అర్జున్..
Pawan Kalyan : గెలిచినా, ఓడినా ఆయనెప్పుడూ పవర్ స్టారే!
ఏపీలో మామయ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీలో ఉన్నప్పుడు వైసీపీ అభ్యర్థికి మద్ధతుగా అల్లు అర్జున్ రావడంతో జనసైనికులు, స్టైలిష్ స్టార్‌పై గుర్రుగా ఉన్నారు. తాజాగా నంద్యాలలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ఈ విషయం తెలిసి కూడా అల్లు అర్జున్ వస్తున్నాడని పెద్ద ఎత్తున జన సమీకరణ చేశాడు వైసీపీ అభ్యర్థి రవిచంద్ర కిషోర్ రెడ్డి..
అనుమతి లేకుండా భారీ సంఖ్యలో జనాన్ని పోగు చేయడంతో అల్లు అర్జున్‌పై, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు జన సమీకరణ చేసినా, అధిక సంఖ్యలో జనాన్ని కలిసినా రిటర్నింగ్ అధికారి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతతి లేకుండా ఇలా చేయడం నేరం. దీంతో అల్లు అర్జున్‌పై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు నంద్యాల పోలీసులు.