Allu Arjun : దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 100వ సినిమా ‘గంగోత్రి’. నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్‌ని హీరోగా పరిచయం చేసిన రాఘవేంద్ర రావు, అప్పటి స్టార్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ చెల్లెలు అతిథి అగర్వాల్‌ని హీరోయిన్గా తీసుకొచ్చాడు. చిన్ననాటి స్నేహితులు, ప్రేమికులుగా మారి, తన ప్రేమను దక్కించుకోవడానికి పెద్దలను ఎలా ఎదురించారనే పాత పాయింట్‌కి Devotional టచ్ జోడించి, సూపర్ సక్సెస్ అయ్యాడు రాఘవేంద్రరావు.
అయితే ఈ మూవీ కారణంగా తనకు అవకాశాలు రాలేదని అంటున్నాడు అల్లు అర్జున్. ‘గంగోత్రి మూవీ తర్వాత నాకు సినిమా అవకాశాలు రాలేదు. అందులో సినిమా తప్పేం లేదు. రాఘవేంద్రరావు గారు బాగా తీశారు. మంచి సినిమా. చాలా బాగా ఆడింది. అయితే అందులో నా లుక్స్ పెద్దగా బాగోవు. అది నా తప్పే.. నేను, హీరోగా పనికి రానని చాలామంది అనుకున్నారు. నిజం చెప్పాలంటే ఆ మూవీ చూసినప్పుడు నా లుక్స్ చూసి నేను కూడా నవ్వుకుంటూ ఉంటా..
Allu Arjun – Pawan Kalyan: మేనమామ పవన్ ని బన్నీ, ‘బాబాయ్’ అని ఎందుకు పిలుస్తాడు?
అందులో ఆ మూవీ తర్వాత ఏడాది గ్యాప్ వచ్చింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సినిమాలు చూస్తూ ఉండేవాడిని. రోజుకి 3 కథలు వింటూ వచ్చాను. ఏదీ నాకు ఎక్కడం లేదు. అప్పట్లో రవితేజ గారి ఇడియట్ మూవీ చూసి, ఇలాంటి మూవీ మనం తీయాలి రా అనుకుంటూ ఉన్నా.. అప్పుడు రాజుగారు ‘దిల్’ మూవీ స్పెషల్ షో వేస్తే వెళ్లాను. అప్పటికే థియేటర్లలో ఆ మూవీ రెండుసార్లు చూశాను కూడా..
అప్పుడే సుకుమార్ కలిశాడు. నా దగ్గర ఓ కథ ఉందని అన్నాడు. విన్నాక అదిరిపోయింది. ఇది నా ఇడియట్ అని ఫిక్స్ అయ్యాను.. సినిమాని మొదలెట్టడానికి, పూర్తి చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డాం. అయితే థియేటర్లలో బొమ్మ పడిన తర్వాత మామూలు రెస్పాన్స్ రాలేదు. నా లుక్స్‌ని తిట్టిన వాళ్లే, చాలా బాగున్నావని, చాలా బాగా చేశావని అన్నారు..’ అంటూ ‘ఆర్య’ 20 ఏళ్ల పండగ ప్రోగ్రామ్‌లో చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్..