కేజీఎఫ్‌కి ముందు యష్ ఎవడు? అల్లు అరవింద్ కామెంట్..

Allu Aravind asks ‘who was Yash before KGF’ : ప్రపంచవ్యాప్తంగా ‘RRR’ కలెక్షన్ల కంటే ఎక్కువ కలెక్షన్లు రాబట్టింది ‘కేజీఎఫ్ 2’. ఈ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు యష్. ‘కేజీఎఫ్ 2’ తర్వాత ఇప్పటిదాకా వేరే మూవీని అనౌన్స్ కూడా చేయలేదు యష్. అయితే యష్‌కి ఒక్కసారిగా వచ్చిన ఈ క్రేజ్‌పై టాలీవుడ్‌లో సెటైర్లు వినిపిస్తూనే ఉన్నాయి.

మరోసారి షాకింగ్ కామెంట్స్‌ చేసిన మాధవీలత… ఆ వ్యాఖ్యలు బాలయ్యను ఉద్దేశించేనా..

‘టైగర్ నాగేశ్వరరావు’ సమయంలో రవితేజ,‘యష్‌కి లక్కీగా కేజీఎఫ్ దొరికింది. ఆ మూవీ లేకపోతే అతను ఎవరో కూడా మనకి తెలీదు’ అంటూ వ్యాఖ్యానించాడు. తాజాగా టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్, యష్ గురించి చేసిన వ్యాఖ్యలు, సాండల్‌వుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

Allu Aravind asks ‘who was Yash before KGF'

‘హీరోలు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడం వల్లే బడ్జెట్ పెరిగిపోతుందనే వాదన కరెక్ట్ కాదు. సినిమా బడ్జెట్‌లో 20-25 శాతం మాత్రమే రెమ్యూనరేషన్ ఉంటుంది. కేజీఎఫ్ మూవీకి ముందు యష్ ఎవరికి తెలుసు. ఆ సినిమా ఎందుకు అంత పెద్ద హిట్ అయ్యింది.

‘టైగర్’ ఫ్లాప్! ‘ఈగల్’ విషయంలో ఇగోలకు పోయి, రవితేజ మళ్లీ తప్పు చేస్తున్నాడా..

భారీగా సినిమా తీయడం వల్లే సినిమా ఎక్కువ మందికి చేరింది. అది కేవలం ఓ ఉదాహరణ మాత్రమే. సినిమా స్థాయి పెరిగితే, హీరో స్థాయి పెరుగుతుంది…’ అంటూ వ్యాఖ్యానించాడు అల్లు అరవింద్.

ఈ వ్యాఖ్యలపై యష్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ‘అల వైకుంఠపురం మూవీకి ముందు అల్లు అర్జున్ కూడా టైర్ 2 హీరోనే. మెగా బ్యాక‌గ్రౌండ్ లేకపోతే అతన్ని ఎవరు చూస్తారు. సొంతంగా కష్టపడి వచ్చిన యష్‌ని చూసి వీళ్లు తట్టుకోలేకపోతున్నారు… ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదే వివాదం పెరిగి పెద్దదైతే, అల్లు అర్జున్ సినిమాలను యష్ ఫ్యాన్స్ వ్యతిరేకించే అవకాశం కూడా లేకపోలేదు.

నో నట్ నవంబర్.. అసలేంటి NNN! ఆపుకోవడం మంచిదేనా..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post