Akshaya Tritiya 2024 : హిందూ సాంప్రదాయాల ప్రకారం సంవత్సరంలో ఈ మూడు రోజులు చాలా ప్రత్యేకం. ఆరోజు ఏ పని ప్రారంభించిన అంతా శుభం జరుగుతుందని నమ్ముతారు. అవి ఏ రోజులంటే..
* ఉగాది
* అక్షయ తృతీయ
* విజయదశమి
అందుకే ఈ మూడు దినాలు ప్రత్యేకమైన రోజుల చూస్తారు. అయితే ఇక్కడ అక్షయ తృతీయ గురించి వివరంగా చెప్పుకుందాo..
అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే మంచిదా? అసలు ఈ అక్షయతృతీయకి బంగారానికి సంబంధం ఏంటి..?
Society of the Snow movie review : 45 మంది, 2 నెలలు, నరమాంసం తింటూ సాగించిన ఓ జీవన పోరాటం..
అక్షయ అంటే ఎప్పటికీ తరగనిది అని అర్థం.. ఇది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో మూడవరోజు వస్తుంది. అందుకని దానిని అక్షయ తృతీయ అని పిలుస్తారు. మన పురాణాల ప్రకారం ఈరోజుకి చాలా విశిష్టత ఉంది అదేంటంటే..
వేదవ్యాసుడు అక్షయ తృతీయ నాడే మహాభారతాన్ని రాయడం ఆరంభించాడు. విష్ణుమూర్తి ఆరవ అవతారమైన పరుశురాముడు. జన్మించిన రోజు కూడా అక్షయ తృతీయ నాడే.
అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలన్న నియమం ఎందుకు వచ్చింది..
కుచేలుడు దరిద్రంతో అష్టకష్టాలు పడుతూ ఉండేవాడు. ఒకరోజు తన ప్రాణ స్నేహితుడైన కృష్ణుడు దగ్గరకు వెళ్తాడు. అప్పుడు తన స్నేహితుడికి ఇవ్వడానికి తన దగ్గర ఏమీ లేవని బాధపడుతూ.. ఇంట్లో ఉన్న అటుకులని కృష్ణుడు వద్దకు తీసుకొని వెళ్తాడు. స్నేహితుడు ఇచ్చిన అటుకుల్లో పిడికిలి తీసుకుని తిన్న కృష్ణుడు అక్షయం ప్రాప్తించుగాక అని ఆశీర్వదిస్తాడు. కృష్ణుడి ఆశీర్వాదంతో కుచేలుడు అష్టఐశ్వర్యాలు పొందుతాడు. ఆ రోజునే అక్షయ తృతీయ పరిగణలోకి తీసుకున్నాయని పురాణాలు చెబుతున్నాయి. అయితే దీనిని ఆధారంగా చేసుకొని అక్షయ తృతీయ రోజున కొన్న ప్రతి వస్తువు మూడింతలు అవుతుందని ఒక నమ్మకం.
నిజానికి ఈరోజు వ్రతం చేస్తే దానికి మూడు రెట్లు పుణ్యం వస్తుంది. పేదలకు దానం చేయడం వల్ల మూడు రెట్లు పుణ్యం వస్తుంది. కొత్త పనులు మొదలుపెట్టడం వల్ల విజయవంతం అవుతాయి. నీ దగ్గర ఉన్నది ఏదైనా లేని వాళ్ళకి దానం చేయడం వల్ల నీకు రెట్టింపు అవుతుంది. కానీ వాటన్నిటినీ వదిలి బంగారం ఈ రోజు కచ్చితంగా కొనాలి అన్న కాన్సెప్ట్ మన మీద రుద్దింది మాత్రం ఈ నగలు వ్యాపారస్తులే అని చెప్పొచ్చు. మొదట అక్షయ తృతీయ నాడు బంగారం కొనాలన్న ఆచారం ఉత్తర భారత దేశంలో లో ఎక్కువగా ఉండేది. తర్వాత తర్వాత కాలక్రమాన అది మన దక్షిణ భారతదేశానికి కూడా పాకింది.
ఇదే నిజమని అనుకున్న చాలామంది తమ దగ్గర డబ్బులు లేకున్నప్పటికీ అప్పు చేసి మరీ బంగారం కొనడానికి అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఆ తర్వాత ఆ అప్పులు తీర్చలేక వడ్డీలు కట్టలేక మళ్ళీ అప్పు చేయడం…చివరికి కొన్న బంగారాన్ని మళ్లీ మార్వాడి షాప్ లో తాకట్టు పెట్టడం. ఆఖరికి ఎంతో ఇష్టంగా కొనుక్కున్న బంగారం మనది కాకుండా అయిపోతుంది చాలామంది మధ్యతరగతి కుటుంబంలో… సో వీలైతే ఈరోజు దానం చేయండి అంతేకానీ డబ్బులు లేకుండా అప్పు చేసి మరి బంగారం షాపుకి వెళ్ళకండి. మనదేశంలో బంగారుపు షాపుల్లో అత్యధిక వ్యాపారం జరిగేది ఈ ఒక్క రోజేనట.