అక్కినేని ఫ్యామిలీ ఫేడ్ అవుట్ అయిపోయినట్టేనా..!?

Akkineni Family : టాలీవుడ్‌ మొత్తం నాలుగు ఫ్యామిలీల చేతుల్లోనే ఉందనేది చాలామందికి తెలిసిన విషయమే. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, రామానాయుడు, మెగాస్టార్.. ఇలా నాలుగు పెద్ద ఫ్యామిలీల నుంచి అరడజనుకి పైగా హీరోలు, నటీనటులు, నిర్మాతలు ఇండస్ట్రీలో ఉన్నారు.

బాలకృష్ణ మూవీ షూటింగ్‌లో లైంగిక వేధింపులు, అందుకే సినిమా ఇండస్ట్రీని వదిలేశా..

తొలి తరంలో ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, కృష్ణ, కృష్ణంరాజు టాలీవుడ్‌ని ఏలితే ఆ తర్వాత మెగాస్టార్‌తో పాటు ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ, ఏఎన్నాఆర్ కొడుకు నాగార్జున, రామానాయుడి కొడుకు వెంకటేశ్.. ఈ నలుగురు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా వెలుగొందారు.

మూడోతరం వచ్చేసరికి నందమూరి ఫ్యామిలీ నుంచి జూనియర్ ఎన్టీఆర్, కృష్ణ వారసుడు మహేష్, కృష్ణంరాజు వారసుడిగా (తమ్ముడి కొడుకు) ప్రభాస్, మెగాస్టార్ వారసుడిగా రామ్‌చరణ్, అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్.. స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు.

Akkineni Family

అయితే థర్డ్ జనరేషన్‌లో వారసులను స్టార్లుగా చేయడంలో మాత్రం అక్కినేని ఫ్యామిలీ విఫలమైంది. నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య, చిన్న కొడుకు అఖిల్ హీరోలుగా పరిచయం అయ్యారు. అయితే అప్పుడెప్పుడో 14 ఏళ్ల క్రితం 2009లో ‘జోష్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య, ఇప్పటికీ సెకండ్ గ్రేడ్ హీరోగానే మిగిలిపోయాడు..

SSMB29 కోసం సూపర్ స్టార్ కి జక్కన్న కండీషన్స్..

తన కెరీర్‌లో సుకుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ వంటి పెద్ద దర్శకులతో సినిమాలు చేసినా… రాజమౌళి, పూరీ జగన్నాథ్, తివిక్రమ్ శ్రీనివాస్ వంటి పెద్ద దర్శకులతో ఇప్పటిదాకా పనిచేయలేకపోయాడు నాగచైతన్య. అప్పుడప్పుడూ ‘మజిలీ’, ‘లవ్ స్టోరీ’ వంటి హిట్లు కొడుతున్నా, టాప్ 4 లో కాదు కదా, టాలీవుడ్ టాప్ 10 హీరోల లిస్టులో కూడా చేరలేకపోయాడు చైతూ..

అఖిల్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మొదటి సినిమాతోనే అఖిల్‌ని టాప్ హీరోల లిస్టులో చేర్చాలని తపన, తాపత్రయం చూపించాడు నాగ్. ఫలితం తేడా కొట్టేసింది. ఇప్పటిదాకా అరడజను సినిమాలు చేస్తే, అందులో ఒక్కటి కూడా క్లీన్ హిట్‌గా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది.

ప్రతీసారీ భారీ బడ్జెట్ పెట్టి, బాక్సాఫీస్ బద్ధలు కొట్టాలని బరిలో దిగడం, నిర్మాతలకు భారీ నష్టాలు మిగల్చడం అఖిల్‌కి అలవాటుగా మారిపోయింది. వీవీ వినాయక్, సురేందర్ రెడ్డి వంటి దర్శకులు కూడా అఖిల్‌కి హిట్ ఇవ్వలేకపోయారు..

నాగార్జున, తన కెరీర్‌లో స్టార్‌డమ్ కంటే ప్రయోగాత్మక సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. ఎంతోమంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అయితే ఇప్పుడు నాగ్‌ కూడా జనాలను థియేటర్లకు రప్పించలేకపోతున్నాడు.

బాలీవుడ్‌లో సాయి పల్లవి! ఏకంగా ఆమీర్ ఖాన్ కొడుకుతో సినిమా… ఆ సీన్స్ చేస్తుందా..

‘ఊపిరి’ కూడా నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టలేకపోయింది. ఆ తర్వాత తీసిన ‘రాజుగారి గది 2’, ‘ఆఫీసర్’, ‘దేవదాస్’, ‘మన్మథుడు 2’, ‘వైల్డ్ డాగ్’, ‘ది ఘోస్ట్’… అన్ని బాక్సాఫీస్ డిజాస్టర్లుగానే మిగిలాయి. ఇకనైనా నాగ్ అండ్ సన్స్ కొత్తగా ఆలోచించకపోతే త్వరలోనే అక్కినేని ఫ్యామిలీ ఫేడ్ అవుట్ అయిపోవడం ఖాయం..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post