Aishwarya Rajinikanth : రజినీకాంత్ కూతురు ఐశ్వర్యా రజినీకాంత్ దర్శకత్వంలో వచ్చిన ‘లాల్ సలాం’ బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా తెలుగులో జీరో షేర్ రాబట్టింది. ఇంత పెద్ద ఫ్లాప్ వచ్చేసరికి ఏదో ఒకటి కవర్ చేయాలనే తాపత్రయంతో 2 వేల మందితో 21 రోజుల పాటు క్రికెట్ మ్యాచ్‌ని షూట్ చేశామని, అయితే ఆ హార్డ్ డిస్క్ పోయిందని.. అందుకే సినిమా అవుట్ ఫుట్ సరిగ్గా రాలేదని చెప్పింది ఐశ్వర్యా రజినీకాంత్..
Rajinikanth Lal Salaam : పరువు పోయాక, ఆ సీన్స్ పోయాయంటే మాత్రం ఏం లాభం..
సినిమా పోయాక జనాల సానుభూతి తెచ్చుకునేందుకు చెప్పిన ఈ మాటలు, ఐశ్వర్యాని కొత్త చిక్కుల్లో పడేశాయి. ఈ సినిమా రిలీజ్‌కి ముందే నెట్‌ఫ్లెక్స్‌తో ఓటీటీ డీల్ కుదిరింది. రజినీ క్రేజ్‌ని చూపించి, ఏకంగా ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ని రూ.150 కోట్లకు నెట్‌ఫ్లిక్స్‌కి విక్రయించినట్టు సమాచారం..
దీంతో సినిమా రిలీజ్‌కి ముందే ఈ డీల్ కుదరవడంతో ఐశ్వర్యా మిస్ అయ్యిందని చెబుతున్న ఆ 21 రోజుల ఫుటేజీని ఓటీటీ వర్షన్‌లో జత చేయాల్సిందేనని డిమాండ్ చేస్తోంది నెట్‌ఫ్లిక్స్.. లేదంటే నష్టపరిహారంగా భారీ మొత్తం డిమాండ్ చేస్తోంది. సినిమా పోయిన తర్వాత పబ్లిక్ సింపథీ కోసం ప్రయత్నించిన ఐశ్వర్యాకి ఇప్పుడు కొత్త తలనొప్పి మొదలైంది..