AHAM Reboot Movie Review : ఫ్లాపులతో కెరీర్‌ని మొదలెట్టిన అక్కినేని హీరో సుమంత్. ‘సత్యం’ సినిమాతో సక్సెస్ రుచి చూసిన సుమంత్, ఆ తర్వాత ‘గౌరి’, ‘గోదావరి’, ‘మధుమాసం’, ‘గోల్కొండ హై స్కూల్’, ‘మళ్లీ రావా’ వంటి సక్సెస్‌లు అందుకున్నాడు. రెండేళ్ల క్రితం ‘మళ్లీ మొదలైంది’ సినిమాని రిలీజ్ చేసిన సుమంత్, ఆ తర్వాత డైరెక్ట్ సినిమాని తీసుకురాలేదు. తాజాగా సుమంత్ నటించిన ‘అహం రీబూట్’ సినిమా నేరుగా ఓటీటీ ఫ్లాట్‌లో రిలీజ్ అయ్యింది.
అక్కినేని ఫ్యామిలీ ఫేడ్ అవుట్ అయిపోయినట్టేనా..!?
రేడియో మిర్చీలో జాకీగా పనిచేసే హీరోకి అనుకోకుండా ఓ కాల్ వస్తుంది. తాను ఓ ప్రమాదంలో ఇరుక్కున్నానని, తనను రక్షించాలని ఓ మహిళ, హీరోని కోరుతుంది. ఆమె ఎవరు? రేడియో స్టేషన్‌లో చెబితే ఆమెకు లేనిపోని సమస్యలు వస్తాయి. దీంతో ఆమె చెప్పే ఫజిల్స్ ద్వారా తన గురించి తెలుసుకోవాలని అనుకుంటాడు హీరో. మరి హీరో, తనను కనిపెట్టి, ఆమెను కాపాడగలిగాడా? ఇదే ‘అహం రీబూట్’ సినిమా కథ..
ఈ సినిమా మొత్తం కనిపించేది సుమంత్ మాత్రమే. పోలీస్ ఆఫీసర్, హీరోకి వచ్చే కాల్స్ రూపంలో రెండు, మూడు వాయిస్‌లు మాత్రమే వినిపిస్తాయి. తెలుగులో ఇలాంటి సోలో యాక్ట్ సినిమాలు చాలా అరుదు. అప్పుడప్పుడూ కొన్ని సినిమాలు ఇలా ప్రయోగాత్మకంగా వచ్చినా, పెద్దగా సక్సెస్ కాలేదు. అందుకే ఈ సినిమాని థియేటర్లలోకి తీసుకురాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు.
Kalki 2898AD Movie Story : ధర్మరాజు ఆడిన చిన్న అబద్ధమే, ‘కల్కి 2898AD’ స్టోరీకి మూలం!
డైరెక్టర్ అట్లూరి ప్రశాంత్ సాగర్ తీసుకున్న లైన్‌ని, చక్కగా ప్రజెంట్ చేయగలిగాడు. ఒకే పాత్రతో కథను నడిపిస్తూ, కథను చెప్పాలనుకోవడం మామూలు విషయం కాదు. దీనికి స్క్రీన్ ప్లే బలంగా ఉండాలి. అక్కడ ‘అహం’ కాస్త దెబ్బ తిన్నట్టుగా అనిపిస్తుంది. ఇలా థ్రిల్లర్స్‌కి ప్రధాన ఆయువు పట్టు బ్యాక్ గ్రౌండ్ స్కోర్. శ్రీరామ్ మాధురి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు పెద్దగా మెప్పించదు. కొన్ని సీన్స్ బాగున్నా, తెరపైన ఒకే పాత్ర మళ్లీ మళ్లీ కనిపిస్తూ ఉంటే బోర్ కొట్టడం కామన్.. ఇదే లైన్‌ని కొంతమంది నటీనటులను జోడించి, మరింత టైట్ స్క్రీన్ ప్లేతో తీస్తే పర్ఫెక్ట్ థ్రిల్లర్ అవుతుందని అనిపిస్తుంది. అయితే ప్రయోగాత్మక సినిమాలు ఇష్టపడేవాళ్లు ఈ సినిమాని ఇష్టపడొచ్చు.. ‘AHAM Reboot’ సినిమా ‘ఆహా’ ఓటీటీ యాప్‌లో అందుబాటులో ఉంది..