Actress Vichitra shares casting couch experience : ‘ముత్తు’ వంటి ఎన్నో సినిమాల్లో నటించిన నటి విచిత్ర, ప్రస్తుతం తమిళ ‘బిగ్‌బాస్’ టీవీ ప్రోగ్రామ్‌లో కంటెస్టెంట్‌గా ఉంది. తాజాగా ఈ టీవీ షోలో విచిత్ర చేసిన కొన్ని కామెంట్లు, సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
బాలీవుడ్‌లో సాయి పల్లవి! ఏకంగా ఆమీర్ ఖాన్ కొడుకుతో సినిమా… ఆ సీన్స్ చేస్తుందా..
‘2001లో ఓ టాప్ తెలుగు హీరోతో మూవీ చేస్తున్నా. కేరళలో షూటింగ్ చేస్తున్నాం. ఆ సమయంలో హీరో గారు, నా దగ్గరికి వచ్చి తన రూమ్‌కి రమ్మని పిలిచారు. మొదటి కలిసినప్పుడే తను అలా చేయడం చూసి నేను షాక్ అయ్యాను. కానీ అతని రూమ్‌కి వెళ్లలేదు. అయితే ఆ తర్వాత కొందరు నన్ను ఇబ్బంది పెట్టడం మొదలెట్టారు. అర్ధరాత్రి రూమ్ దగ్గరికి వచ్చి తలుపులు గట్టిగా కొట్టేవాళ్లు. కొందరు మగాళ్లు ఎక్కడపడితే అక్కడ తాగుతూ లైంగికంగా హింసించారు.
ఆ వేధింపుల నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక ప్రతీ రూమ్ మారుతూ ఉండేదానిని. అయినా షూటింగ్ టైమ్‌లో శారీరకంగా వేధించారు. ఈ విషయంపై నడియార్ సంఘంలో కంప్లైంట్ చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. సెట్‌లో నన్ను అసభ్యంగా తాకుతున్న ఓ వ్యక్తిని పట్టుకుని, స్టంట్ మాస్టర్ దగ్గరికి తీసుకెళ్లా. అతను, సినిమా యూనిట్ అందరి ముందు నన్ను కొట్టాడు. దాన్ని తట్టుకోలేక సినిమా ఇండస్ట్రీని వదిలేశా… కంప్లైంట్ చేసినా ఎవ్వరూ రాలేదు. కొన్నాళ్లకు అన్నీ మరిచిపోయి, సర్దుకుపోవాలని చెప్పారు… ’ అంటూ కామెంట్ చేసింది విచిత్ర..
త్రిషను రేప్ చేయాలని అనుకున్నా! ‘లియో’ నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ షాకింగ్ కామెంట్స్..
పేరు చెప్పకపోయినా విచిత్ర చేసిన సినిమాలను చూస్తే ఆ హీరో బాలకృష్ణే అని తెలిసిపోతుంది. 2001లో వచ్చిన బాలకృష్ణ ‘భలేవాడివి బాసు’ సినిమాలో ఓ చిన్న రోల్ చేసింది విచిత్ర. శిల్పా శెట్టి, అంజలీ జవేరీ హీరోయిన్లుగా నటించిన ‘భలేవాడివి బాసు’ మూవీకి ‘తమ్ముడు’ వంటి మూవీస్ తీసిన అరుణ్ కుమార్ దర్శకుడు. ఈ మూవీకి పి. విజయన్ స్టంట్ మాస్టర్.