Actress Anjali : ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో అంజలిని, నందమూరి బాలకృష్ణ ‘జరగమంటూ’ తోసేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాలయ్య ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి తాగి వచ్చి, హీరోయిన్ అంజలితో అనుచితంగా ప్రవర్తించాడంటూ చాలా న్యూస్ ఛానెళ్లు, వీడియోను మళ్లీ మళ్లీ ప్లే చేశాయి. ఈ సంఘటనపై నిర్మాత నాగవంశీ, ‘పక్కకు జరగమంటే జరగనప్పుడు ఇలా అంటాం కదా.. అలాగే అన్నారు. దానికి ముందు వీడియో, తర్వాతి వీడియో చూడండి. ఆమె కూడా నవ్వారు, వాళ్లిద్దరూ షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకున్నారు’ అంటూ సమాధానం ఇచ్చాడు. అయితే నాగవంశీ సమాధానం ఇచ్చినా బాలకృష్ణపై వార్తలు ఆగలేదు..
దీంతో అంజలి ఈ విషయం గురించి రియాక్ట్ అయ్యింది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి వచ్చిన ఈ వేడుకకు సక్సెస్ చేసిన బాలకృష్ణగారిక థ్యాంక్స్. బాలకృష్ణగారికీ, నాకు మధ్య పరస్పర గౌరవం ఉంది. ఎంతో కాలంగా మేం మంచి స్నేహితులం కూడా.. ఆయనతో మరోసారి ఇలా స్టేజ్ పంచుకునే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేసింది అంజలి…
ఇదే ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ కాళ్ల దగ్గర మందు బాటిల్ ఉండడంపై పెద్ద రచ్చ రేగింది. ‘అది రియల్ కాదు, సీజీఐ చేశారని’ నాగ వంశీ చెప్పడంతో మరింత రచ్చ అయ్యింది. ‘యాపిల్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, క్యారెట్ జ్యూస్.. మే 31న థియేటర్లలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రిలీజ్ అంటూ ఓ వీడియో షేర్ చేశాడు. పెట్రోల్ క్యాన్‌లా ఉండే బాటిల్‌లో ఉన్నది, రస్నా అని.. దీన్ని ఫ్రాంక్ అంటారంటూ టీవీ9 రిపోర్టర్‌కి చెబుతున్న వీడియోను షేర్ చేశాడు విశ్వక్ సేన్. ‘CG చేశారని చెప్పే బదులుగా, ముందే అది జ్యూస్ అని చెప్పి ఉంటే అయిపోయేదని’ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు..