Actor Anjali : హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా, మార్చి 22న విడుదల అవుతోంది. అంజలి ప్రధాన పాత్రలో రూపొందుతున్న 50వ సినిమా ఇది. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో పుట్టి, హీరోయిన్‌గా 50 సినిమాలు చేసిన తెలుగు అమ్మాయిగా రికార్డు క్రియేట్ చేసింది అంజలి. ఇంతకుముందు జయ సుధ, జయప్రద, విజయశాంతి, రంభ, రోజా, భానుప్రియ, వాణి శ్రీ, జమున, కృష్ణకుమారి, కన్నాంబ, భానుమతి, సావిత్రి, రాశి, రంభ వంటి తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన హీరోయిన్లు.. ఇటు టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో, బాలీవుడ్‌లోనూ సినిమాలు చేశారు.
Natural Star Nani : నాని ‘సరిపోదా శనివారం’ కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉందే..
వీరి తర్వాత లయ, పూనమ్ కౌర్ వంటి తెలుగు అమ్మాయిలు, హీరోయిన్లుగా సినిమాలు చేసినా.. 50 సినిమాల క్లబ్‌లో చేరలేకపోయారు. రాజోలు ఏరియాలో పుట్టిన అంజలి, ‘ఫోటో’ సినిమాతో 2006లో తెరంగ్రేటం చేసింది. ఆ తర్వాత తమిళ్, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలోకి వెళ్లి అక్కడ బాగా సక్సెస్ అయ్యింది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చిన అంజలి, అటు హీరోయిన్‌గా చేస్తూనే క్యారెక్టర్ రోల్స్‌లోనూ నటిస్తోంది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన అతిది రావు హైదరీ, ప్రియాంక జవాల్కర్, డింపుల్ హయతి, బిందు మాధవి, ఈషా రెబ్బా, రీతూ వర్మ వంటి హీరోయిన్లు ఇండస్ట్రీలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే వీరిలో కొంతమంది కెరీర్ ఇప్పటికే ముగిసిపోగా, మిగిలినవాళ్లు కూడా పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోతున్నారు.
Bandla Ganesh : బండ్ల గణేశ్‌కి ఏడాది జైలు..