Aa Okkati Adakku Review : ‘జబర్దస్త్’ కామెడీ షో, సోషల్ మీడియా కారణంగా కామెడీ సినిమాలు వర్కవుట్ కాకపోవడంతో డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తూ వచ్చాడు అల్లరి నరేశ్. అయితే తన నుంచి కామెడీ సినిమాలను మిస్ అవుతున్నామని ఫ్యాన్స్ కోరడంతో మళ్లీ ‘ఆ ఒక్కటి అడక్కు’ పేరుతో కామెడీ జోనర్‌లో సినిమా చేశాడు. ‘జాతిరత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ, మే 3న విడుదలైంది.. మరి అభిమానుల అంచనాలను ‘ఆ ఒక్కటి అడక్కు’ మూవీ అందుకోగలిగిందా..
తండ్రి ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చిన క్లాసిక్ కామెడీ ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా టైటిల్‌ని వాడుకున్నాడు ‘అల్లరి’ నరేశ్. ప్రభుత్వాఫీసులో పనిచేసే హీరోకి 30 దాటినా పెళ్లి కాదు. పెళ్లి చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నా, సెట్ కాదు. అలా పెళ్లి కోసం అష్టకష్టాలు పడుతున్న హీరో జీవితంలోకి అనుకోకుండా హీరోయిన్ వస్తుంది. హీరోకి పెళ్లి అయ్యిందా? సింపుల్‌గా ఇదే ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమా స్టోరీ…
Cat Biryani in Chennai: రోడ్ సైడ్ బిర్యానీలో పిల్లి మాంసం..
కథ పరంగా ఇందులో కొత్తదనం ఏమీ లేదు. కేవలం ‘పెళ్లి ఎప్పుడూ ఎప్పుడూ అని యువతను చంపకండి’ అనే లైన్‌ని సినిమాగా మార్చే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ మల్లి అంకం. సినిమాలో వెన్నెల కిషోర్, హర్ష, అల్లరి నరేశ్ వంటి కమెడియన్లు ఉన్నా ప్రేక్షకులు తెగ కష్టపడతారు.
గోపిసుందర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, పాటలు ఏమీ సినిమాని కాపాడలేక, మరింత బోర్ కొట్టించాయి. అల్లరి నరేష్ కామెడీ సినిమాలు ఇష్టపడే వారికి ‘ఆ ఒక్కటి అడక్కు’ మూవీ ఓ బిలో యావరేజ్ బొమ్మగా మిగులుతుంది. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గ్లామర్ కూడా సినిమాని కాపాడలేకపోయింది.
అల్లరి నరేశ్ సీరియస్ సినిమాలు మానేసి కామెడీ సినిమాలు చేయాలనుకుంటే ఇలాంటి రొటీన్ కాన్సెప్ట్స్ కాకుండా శ్రీవిష్ణు మాదిరిగా డిఫరెంట్ కాన్సెప్ట్ కామెడీ కథాంశాలు ఉన్న సినిమాలను సెలక్ట్ చేసుకుంటే బెటర్.