Nani’s Hi Nanna Movie Review : ‘దసరా’ వంటి ఊరమాస్ సినిమా తర్వాత నాని చేసిన మూవీ ‘Hi నాన్న’. కొత్త కుర్రాడు శౌర్యవ్ తెరకెక్కించిన ‘Hi నాన్న’ మూవీ, తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా నేడే (డిసెంబర్ 7) విడుదలైంది. మరి నాని, పాన్ ఇండియా ప్రయత్నం వర్కవుట్ అయ్యిందా?
నితిన్ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ రివ్యూ: ‘ఎక్స్ట్రా’ లేదు కానీ ‘ఆర్డినరీ’గానే ఉంది..
నానికి ఫ్యామిలీ ఆడియెన్స్‌లో, అమ్మాయిల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ ‘Hi నాన్న’ మూవీ పూర్తిగా వారి కోసమే. ట్రైలర్లో చూపించినట్టుగానే ఓ సింపుల్ ఫ్యామిలీ సెంటిమెంట్ కథను, ఎమోషనల్ రైడ్‌గా ఆవిష్కరించాడు శౌర్యవ్. కథగా చూసుకుంటే కొత్తదనమేమీ లేదు. ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కొత్తగా చెప్పడానికి కథలేమీ లేవు కూడా. అప్పుడెప్పుడో వచ్చిన ‘ప్రియరాగాలు’, ‘మావిడాకులు’ సినిమాలను కాస్త అటు ఇటుగా కలిపి తీసినట్టే ఉంటుంది ‘Hi నాన్న’.
అయితే నాని కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్కి తోడు మృణాల్ ఠాకూర్ యాక్టింగ్, చిన్నారి కియారా క్యూట్ పర్ఫామెన్స్ కారణంగా ఎమోషనల్ సీన్స్ బాగా వర్కవుట్ కావడంతో ‘Hi నాన్న’ మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిచింది.
మహేష్ బాబు – సౌందర్య కాంబోలో మూవీ.. మధ్యలో కథ అడ్డం తిరిగి..
మాస్ ఫైట్స్, అడల్ట్ కామెడీ ఆశించేవారికి ‘Hi నాన్న’ అస్సలు నచ్చదు. కాస్త స్లోగా సాగినట్టు అనిపించినా ఫ్యామిలీ ఆడియెన్స్, ‘Hi నాన్న’ మూవీకి బాగానే కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా ‘ఖుషీ’ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహబ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ ‘Hi నాన్న’ మూవీకి ప్రాణం.
శృతి హాసన్ క్యామియో మెప్పించినా ప్రియదర్శిని సరిగ్గా వాడుకోలేదని అనిపిస్తుంది. కొత్త దర్శకుడు శౌర్యవ్, మొదటి సినిమాతోనే తన టాలెంట్ నిరూపించుకున్నాడు. అయితే స్లోగా సాగే ‘Hi నాన్న’ కమర్షియల్‌గా సక్సెస్ సాధించాలంటే ఫ్యామిలీ ఆడియెన్స్ మీదే ఆధారపడి ఉంది…
టెక్ మానభంగాలను అడ్డుకునే దారేది? డీప్ ఫేక్ కేవలం ఆరంభమేనా..