KTR : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బంపర్ మెజారిటీ దక్కింది. తెలంగాణలో మొదటి రెండు సార్లు ఎన్నికల్లో గెలిచిన భారత రాష్ట్ర సమితికి 39 సీట్లు మాత్రమే వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పూర్తిగా బీఆర్‌ఎస్ ఆధిపత్యం కనిపించింది. కానీ వరంగల్, నల్గొండ జిల్లాల్లో పూర్తిగా కాంగ్రెస్ డామినేషన్ కనిపించింది.
జైలుకి వెళ్లి వస్తే చాలు, సీఎం పదవి! అప్పుడు జగన్, ఇప్పుడు రేవంత్ రెడ్డి, నెక్ట్స్ బాబు..?
ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి తర్వాత తెలంగాణలో పరిస్థితి కూడా కర్ణాటకలా మారుతుందని, ‘ఆంధ్రా 2.0’ చూడడానికి సిద్ధంగా ఉండాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు ప్రత్యేక్షం అయ్యాయి. మరీ ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మిస్ అవుతున్నామంటూ ఇన్‌స్టాలో పోస్టులు తెగ ట్రెండ్ అయ్యాయి.
ఇంకొందరైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఉండనీ కానీ, ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్‌కి బాధ్యతలు ఇవ్వాలంటూ పోస్టులు కనిపించాయి. హైదరాబాద్‌లోని మొత్తం ఓటర్లలో దాదాపు 50 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు. నగరంలో కేవలం 47.88 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. ఓటు వేయమంటే వేయడానికి రాని జనాలు, ఇప్పుడు ‘మిస్ యూ కేటీఆర్’ అంటూ పోస్టులు చేయడమే హాస్యస్పదంగా ఉంది.
జనసేన వ్యూహాత్మిక తప్పిదం.. 10 రోజుల ముందు పోటీ చేసి, పరువు పోగొట్టుకుని..
తెలంగాణ ప్రజలు, గత 10 ఏళ్లుగా రోజుకి 24 గంటల విద్యుత్‌కి అలవాటు పడిపోయారు. కాంగ్రెస్ పార్టీ గెలవగానే రాష్ట్రంలో కరెంట్ కోతలు మొదలు కావడంతో రాబోయే ఐదేళ్లు ఎలా ఉండబోతుందో అర్థమవుతోందంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సోషల్ మీడియా నుంచి సహకారం దక్కాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేలా ఉంది.