Marriage : మనదేశంలో పెళ్లి అంటే.. అంగరంగ వైభోగంగా జరుపుతారు. వాళ్ళ జీవితంలో పెళ్లి అనేది ఓ ముఖ్యమైన ఘట్టం.. ఆహా.. ఓహో.. అనిపించేంతగా జరిపించాలిని, తల్లిదండ్రులు, బంధువులు ఉత్సాహం చూపిస్తారు. పెళ్లిలో జరిగే ప్రతిఘట్టం.. జీవితానికి, జీవితంలో వచ్చే ఒడిదుడుకులను ఎదుర్కొంటూ.. జీవితాంతం కలిసి ఉండటానికి అర్థం వచ్చేలా పెళ్ళిలో ప్రమాణం చేయిస్తారు.
అమ్మ ఎప్పుడూ.. అమ్మనుకున్నంతగా గొప్పగా ఉండదు..
పెళ్లిళ్లు చేసుకోవడమే ధ్యేయం :
పెద్దలు, మంచి, చెడులు ఆలోచించి అటు ఏడు తరాలు, ఇటు ఏడుతరాలు చూసి అమ్మాయి – అబ్బాయి జీవితాన్ని ముడివేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే.. అబ్బాయి చదువుకున్నాడా.. ఎంత ఆస్తి ఉంది, సంపాదన ఎంత, USA వెళ్లాడా, పెళ్లి తర్వాతైనా లేదా అని చూసి చేస్తున్నారు. మంచి చెడు పోయింది, అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడటం పోయింది.. ఇప్పుడు పరిస్థితి అబ్బాయిలకు పెళ్లైతే చాలు అనుకునేంతగా కాలం మారిపోయింది.
పెళ్లి నిర్వచనం ఏంటి..
ఆదిమానవుల కాలంలో ఆకలి తీర్చుకోవడం కోసం.. జంతువులను వేటాడి తినేవారనే విషయం అందరికి తెలిసిందే. అయితే అప్పుడు ఆకలితో పాటు తన జంట కోసం కూడా.. అంటే తన జతకట్టిన వాళ్లను వేరొకరితో చూడలేక పోయేవారని అది మానవ నిర్మాణంలో వచ్చిన మార్పు కాదని చరిత్ర చెప్తుంది.
టెక్ మానభంగాలను అడ్డుకునే దారేది? డీప్ ఫేక్ కేవలం ఆరంభమేనా..
అలాంటి ఇద్దరు మనుషులను ఒక్కటి చేస్తే ఎలా ఉంటుంది. కొంతమందికి చెప్పాలిసిన అవసరం లేదు.. కొంతమందికి కాదు చాలామందికి చెప్పాలిసిన అవసరం లేదనే అనుకుంటున్న. దీనికి కారణాలు ఏమైనా.. జీవితంలో వాళ్ళకు కావాల్సింది ఏంటో తెలియక పెళ్ళిలో పడినవాళ్లే ఎక్కువ.
అసలు పెళ్లి అవసరమా..
రొటీన్ లైఫ్ ఎప్పుడూ బోర్. ఒక 35 Years వచ్చాక లైఫ్ లో చాలా చూసేసి ఉంటాం. చుట్టూ స్నేహితులు, బంధువులు ఉన్నా.. జీవిత భాగస్వామి (Soulmate) లేని లోటు అలానే ఉంటుంది. ఎంతమంది వచ్చినా కూడా ఆ వెలితిని పూడ్చడానికి Now a days సహాజీవనం చేస్తున్నారు, ఒకప్పటి గంధర్వ వివాహంలా.. అంటే ఒకరికోసం ఒకరు ప్రమాణం చేసుకోవడం, కలిసి ఉండాలిని మనసా వాచా కర్మణా కోరుకోవడం.
కొంతమంది సహాజీవనం ఉన్నాం అంటే.. అవునా అలాగా అనుకోలేక పోలేదు. మెడలో తాళి కట్టి పెరట్లో కట్టేసిన ఆవులగా ఉండనవసరం లేదు. పెళ్ళైనా, సహజీవనమైనా.. మన ఆనందం కోసమే మొదలయ్యాయి. పెళ్లి కావాలి, వద్దు అని కాకుండా ఆనందంగా బతకడానికి ఏం కావాలో అది చేయండి.