Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. ఎత్తులు, పై ఎత్తులు ప్రచారాలతో గత కొన్ని రోజులుగా నాయకులు హోరెత్తించారు. అయితే ఆఖరి క్షణాల్లో మాత్రం ప్రలోభాలు పర్వం కొనసాగింది. పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు డబ్బులు, మద్యం పంచడంలో బిజీ అయిపోయారు. ఇదిలా ఉంటే వాటిని అడ్డుకోవాల్సిన ఓ పోలీసు అధికారే ఓటర్లకు డబ్బులు పంచుతూ అడ్డంగా బుక్కయ్యాడు.
ఎన్నికల్లో BRS పార్టీ తరపున డబ్బులు పంచుతూ CI అంజిత్ రావు స్థానికులకు పట్టుబడ్డాడు. చెంగిచర్లలోని ఎస్వీఎమ్ హోటల్ నుంచి కారులో డబ్బులు తరలిస్తున్నట్లు గమనించిన స్థానికులు ఆయన కారును వెంబడించి అడ్డుకున్నారు. కారులో సోదాలు చేయగా రూ.6లక్షలు పట్టుబడ్డాయి. స్థానికులు పోలీసు అధికారి మంత్రి మల్లారెడ్డి డబ్బులు తరలిస్తున్నారని ఆరోపించారు. పోలీస్ అధికారులే ఇలాంటి పనులు చేయడంపై నెటిజన్లు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అభ్యర్థులను ఓటుకి నోటు డిమాండ్ చేస్తున్న సాధారణ జనం… ఇది కదా డెవలప్మెంట్..