Prabhas Salaar : పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘వర్షం’ మూవీతో యూత్ లో ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఛత్రపతి మూవీతో ప్రభాస్ లోని మరోకోణాన్ని బయటకు తీసాడు దర్శకధీరుడు రాజమౌళి. కరుకుగా ఉంటూనే సాఫ్ట్ న్యూట్రల్ మాస్ ఎలిమెంట్స్ ని బయటకు తీసాడు జక్కన్న. ఆ మూవీతో ప్రభాస్ మాస్ స్టార్ డమ్ మరింత పెరిగిపోయింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా ఆడకపోయిన డార్లింగ్ సినిమాతో అమ్మాయిలకి అబ్బాయిలకి డార్లింగ్ అయిపోయాడు రెబల్ స్టార్.
రికార్డులు దున్నేందుకు ‘సలార్’ మాస్టర్ ప్లాన్.. ఒక్క కర్ణాటకలోనూ వెయ్యికి పైగా థియేటర్లు..
మిర్చీ మూవీలో ప్రభాస్ స్టైల్, మ్యానరిజం, డ్రెస్సింగ్ సెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఇక ఆ తరువాత వచ్చిన బాహుబలి ప్రభాస్ ని ఎక్కడికో తీసుకుపోయింది. బాహుబలి2 తో ప్రపంచం మొత్తం టాలీవుడ్ వైపు చూసేలా చేసాడు రాజమౌళి. మొరటుగా కరుకుగా ఉండే ప్రభాస్ మాస్ హీరోగా మాత్రమే నిలదొక్కుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ Mr Perfect మూవీతో అన్నివర్గాల ప్రేక్షకులు అభిమానించే హీరోగా మారడానికి ప్రభాస్ కి ఎక్కువ టైం పట్టలేదు.
మంచి హైటూ.. పర్సనాలిటీ.. ఫిట్ నెస్ తో కనిపించే ప్రభాస్ అమ్మాయిల కలల్లో గ్రీకువీరుడు అయ్యాడు. అయితే కొన్ని రోజులుగా ప్రభాస్ లుక్స్ పై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. ప్రభాస్ లుక్ అస్సలు బాలేదని, ఆరోగ్యం మీద, ఫిట్ నెస్ మీద శ్రద్ద పెడితే బావుంటుందని విమర్శిసించిన వాళ్లు లేకపోలేదు. ఆ మధ్య ఆదిపురుష్ సినిమా షూటింగ్ అప్పుడు కూడా బాలీవుడ్ ట్రోలర్స్ ప్రభాస్ లుక్ పై విమర్శలు చేశారు. సినిమా రిలీజ్ తరవాత అవి ఇంకా పెరిగిపోయాయి.
అయితే ఈ మధ్య హిట్స్, ఫ్లాప్స్ అనేవి ఇండస్ట్రీలో చాలా చిన్న విషయం అయిపోయింది. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ, ప్రభాస్ ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎంతోమంది హీరోస్ భారీ బడ్జెట్ మూవీస్ చేస్తుండగా.. వాళ్ళ అభిమానులు ఫ్లాప్ లేకుండా చేస్తున్నారు. వాళ్ళ అభిమానం ఇండస్ట్రీ అవసరం తీరుస్తుంది. ఇటీవల విడుదలైన ఆదిపురుష్ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ మూవీ కలెక్షన్స్ చూస్తే దిమ్మ తిరిగిపోయేలా ఉంది.
శత్రువులుగా మారిన ఇద్దరు స్నేహితుల కథే ‘సలార్’… ‘కేజీఎఫ్’తో లింక్..
ఇప్పుడు ప్రభాస్ కి హిట్ అవసరమా అంటే చెప్పలేని పరిస్థితి నెలకొంది. నిజానికి ఇటీవల ప్రభాస్ కి హిట్ లేదు కానీ ప్రభాస్ కి వచ్చే ఓపెనింగ్స్, మార్కెట్ లో తనకి ఉన్న క్రేజ్, OTT
పోటీలోగాని, బుల్లి స్క్రీన్లోగాని ప్రభాస్ కి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఆదిపురుష్ తో “సలార్” మూవీ కూడా భారీ అంచనాల మధ్య భారీ భారీ ఫైట్స్ తో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కింది. అయితే రేపు ట్రైలర్ మూవీ లవర్స్ కోసమా, లేక ప్రభాస్ ఫాన్స్ కోసం మాత్రమే పరిమితం అవుతుందో చూడాలి.
ప్రశాంత్ నీల్ ఇప్పటికే KGF 1, 2తో తానేంటో నిరూపించుకున్నాడు. ప్రపంచం మొత్తం గోల్డ్ మైన్ చేశాడు నీల్ మావ. దీంతో నెక్స్ట్ చేస్తున్న ప్రభాస్ తో చేస్తున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీపై డార్లింగ్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇప్పుడు ప్రశాంత్ నీల్ నుంచి వచ్చే ఈ సినిమా హిట్ అవ్వాలని ఫాన్స్ వైటింగ్. కానీ మూవీ కలెక్షన్ విషయంలో ఇండియాలో ఘాటు మిర్చి అని ఆల్రెడీ నిరూపించుకున్నాడు డార్లింగ్ ప్రభాస్.. సలార్ టీజర్ కొంత నిరూత్సపరచగా.. రేపొచ్చే సలార్ ట్రైలర్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ దాహం తీరుస్తుందేమో చూడాలి..!?
టెక్ మానభంగాలను అడ్డుకునే దారేది? డీప్ ఫేక్ కేవలం ఆరంభమేనా..