డిసెంబర్‌లో దించుతా అన్నాడు, మార్చికి మార్చేశాడు.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కొత్త రిలీజ్ డేట్..

Vishwak Sen Gangs of Godavari : ప్రతీ సినిమాకి కథ, కథనంలో వైవిధ్యం చూపిస్తున్నాడు విశ్వక్‌సేన్. ‘ఈ నగరానికి ఏమైంది’ తర్వాత ‘ఫలక్‌నుమా దాస్’, ‘పాగల్’, ‘ఓరి! దేవుడా’, ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’, ‘దాస్ కా ధమ్కీ’ వంటి సినిమాలు, విశ్వక్‌సేన్‌కి యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి.

చిరంజీవి, ప్రతీ ఏడాది పాత హీరోయిన్లతో పార్టీ చేసుకుంటాడు! అతనా నాకు చెప్పేది..

ప్రస్తుతం కృష్ణ చైతన్య డైరెక్షన్‌లో చేస్తున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ మొదటి వారంలో విడుదల కావాల్సి ఉంది. అయితే తాజాగా ఈ మూవీని వచ్చే ఏడాది మార్చి 8న విడుదల చేయబోతున్నట్టు కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటించింది మూవీ టీమ్..

Vishwak Sen Gangs of Godavari

ఈ మూవీ డిసెంబర్‌లో విడుదల కాకపోతే ప్రమోషన్స్‌లో పాల్గొనను అని కొన్నిరోజుల క్రితం ఇన్‌స్టాలో స్టోరీ పోస్ట్ చేశాడు విశ్వక్ సేన్. ‘ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వస్తే తొక్కేయాలని ప్రతీ ఒక్కడూ చూస్తున్నాడు. చాలా భరించా. నా మూవీ డిసెంబర్‌లో విడుదల కాకపోతే ఈ మూవీ ప్రమోషన్స్‌లో నన్ను చూడరు’ అంటూ ఇన్‌స్టా స్టోరీ పెట్టి డిలీట్ చేశాడు విశ్వక్ సేన్..

హానీ రోజ్‌ అందాలకి యూత్‌లో బీభత్సమైన క్రేజ్.. అయినా ఏం లాభం, ఆ మూవీ వల్ల..

మరి మార్చిలో విశ్వక్ సేన్, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రమోషన్స్‌లో పాల్గొంటాడో? లేక హీరో లేకుండానే ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుందో చూడాలి. డిసెంబర్ 7న నాని నటించిన ‘హాయ్ నాన్న’, నితిన్ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ విడుదల కాబోతున్నాయి. ఇదే తేదీని విడుదల కావాల్సిన వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ కూడా వాయిదా పడింది.

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post