Mansoor Ali Khan vs Trisha : త్రిషను రేప్ చేయాలని అనుకున్నా అంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేసి, వివాదాల్లో ఇరుక్కున్న నటుడు మన్సూర్ ఆలీ ఖాన్, చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన పరువుకి నష్టం వాటిల్లేలా వ్యాఖ్యలు చేసినందుకు త్రిషపై, మెగాస్టార్ చిరంజీవిపై పరువు నష్టం దావా వేయాలని అనుకున్నాడు మన్సూర్ ఆలీ ఖాన్.
నా పరువు తీస్తున్నారు! త్రిష, చిరంజీవిపై క్రిమినల్ కేసు పెట్టబోతున్న మన్సూర్ ఆలీ ఖాన్..
‘చిరంజీవి ఎంత పెద్ద యాక్టర్. ఆయన పార్టీ పెట్టి అమ్ముకున్నాడు. చాలా రకాలుగా కొన్ని వేల కోట్లు సంపాదించాడు. ఎంత డబ్బున్నా పేదలకి ఎలాంటి సాయం చేయడం లేదు. ఆయనతో కలిసి నటించాను. ప్రతీ సంవత్సరం తనతో నటించిన పాత హీరోయిన్లందరినీ పిలిచి పార్టీ చేస్తాడు.
ప్రతీ సంవత్సరం చిరూ పార్టీ ఉంటుంది. నేను కూడా అతనితో కలిసి నటించాను. నాకు మాత్రం ఎప్పుడూ ఆ పార్టీకి పిలుపు రాలేదు. ఆయన కేవలం పాత హీరోయిన్లను మాత్రమే పిలిచి, పార్టీ ఇస్తాడు. అది నీ ఇష్టం. నువ్వు ఏదైనా చేసుకో…
త్రిషను రేప్ చేయాలని అనుకున్నా! ‘లియో’ నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ షాకింగ్ కామెంట్స్..
అయితే నా గురించి ట్వీట్ చేసే ముందు నాకు ఓసారి కాల్ చేసి అసలు ఏమైంది? అని అడగాల్సింది. అంత పెద్ద నటుడు, ఏమీ తెలుసుకోకుండా ఇలా ట్వీట్ చేయడమే నాకు బాధ కలిగించింది..’ అంటూ కామెంట్ చేశాడు మన్సూర్ ఆలీ ఖాన్.. ఈ వ్యాఖ్యలతో మన్సూర్‌పై సీరియస్ అవుతున్నారు మెగా ఫ్యాన్స్..
బాలకృష్ణ మూవీ షూటింగ్లో లైంగిక వేధింపులు, అందుకే సినిమా ఇండస్ట్రీని వదిలేశా..