Importance of NOTA : తెలంగాణ ఎన్నికలకు సైరన్ మోగింది. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలకు కూడా పెద్దగా సమయం లేదు. సినిమా టికెట్ల కోసం థియేటర్ల దగ్గర, మ్యాచ్ చూసేందుకు స్టేడియం గేటు దగ్గర గంటలు గంటలు నిలబడే జనాలు, ఓటు వేయడానికి మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. తరం మారినా, ఆలోచన మాత్రం మారడం లేదు. దీనికి ప్రధాన కారణం ఎన్నికల వల్ల వ్యక్తిగతంగా సినిమా చూసిన ఎంటర్‌టైన్‌మెంట్ కూడా దక్కకపోవడం. ఎవడు గెలిస్తే మనకేంటి? అనే అభిప్రాయం నిండిపోవడం.
క్రిమినల్ కేసులు ఉంటేనే ఎమ్మెల్యే సీటు! బీఆర్‌ఎస్ అభ్యర్థుల్లో సగం మంది..
మరో కారణం ఎలక్షన్లలో నిలబడే అభ్యర్థులు అందరూ కూడా అవినీతి పరులే, అసమర్థులు అనే అభిప్రాయ నిండిపోవడం. అయితే ఈసారి ఓటు వచ్చిన నవతరం మాత్రం ఓటు హక్కు వినియోగించుకునేందుకు తహతహలాడుతోంది. వీరిలో చాలామంది నోట ‘నోటా’ మాటే వినబడుతోంది. ఏమిటి ‘నోటా’? దీనికి అంత పవర్ ఉందా..!?
NOTA అంటే None of the Above. ఎలక్షన్లలో నిలబడిన అభ్యర్థులు ఎవ్వరూ సరైన వాళ్లు కాదనే అభిప్రాయపడితే నోటాకి వేయొచ్చు. కొన్నిసార్లు ఒక్క ఓటు తేడాతో రిజల్ట్ మారిపోతుంది. ఓ అవినీతిపరుడిని అధికారంలోకి రాకుండా అడ్డుకునే అధికారం మాత్రం నోటాకి లేదు. ఎందుకుంటే నోటాకి ఎన్ని ఓట్లు వచ్చినా మిగిలిన ఓట్లలో ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి గెలిచినట్టు ప్రకటిస్తారు.
Hero Venkatesh: రాజకీయాల్లోకి విక్టరీ వెంకటేశ్.. వియ్యంకుడిని గెలిపించుకోవడానికి..
అలా కాకుండా నోటాకి ఎక్కువ ఓట్లు వస్తే, ఆ నియోజిక వర్గంలో అభ్యర్థులను అనర్హులుగా జనాలు అభిప్రాయపడుతున్నట్టుగా గుర్తించి, వాళ్లు మళ్లీ పోటీ చేయకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చాలామంది అభిప్రాయం.
2014 లోక్‌సభ ఎన్నికల్లో, 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ‘నోటా’కి వచ్చిన ఓట్ల శాతం భారీగా ఉంది. నోటా వల్ల పోలైన ఓట్ల శాతం పెరుగుతుంది. ప్రజాభిప్రాయం స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఓట్ల శాతానికి రాజకీయ నాయకులు ఎంత ప్రాధాన్యం ఇస్తారు. 56 శాతం బంపర్ మెజారిటీ గెలిచిన ఎమ్మెల్యే అయినా 1 ఓటు తేడాతో గెలిచిన ఎమ్మెల్యే అయినా గెలిచిన తర్వాత సంబరాలు చేసుకుంటాడు. కాబట్టి ‘నోటా’కి విలువ కూడా ‘None of the Above’.
నేను ఇండియాలో పుట్టి ఉంటే.. ప్రధాని మోదీపై అమెరికా సింగర్ మేరీ మిల్‌బెన్ షాకింగ్ కామెంట్స్..