హానీ రోజ్‌ అందాలకి యూత్‌లో బీభత్సమైన క్రేజ్.. అయినా ఏం లాభం, ఆ మూవీ వల్ల..

Honey Rose : సంక్రాంతికి విడుదలైన బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ మూవీ, హానీ రోజ్‌కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అప్పుడెప్పుడో 2008లో ‘ఆలయం’ అనే మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది హానీ రేజ్. ప్రస్తుతం బిగ్‌బాస్‌లో ఉన్న శివాజీ హీరోగా వచ్చిన ‘ఆలయం’ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ కావడంతో ఈ మలయాళ బ్యూటీకి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.

బాలకృష్ణ మూవీ షూటింగ్‌లో లైంగిక వేధింపులు, అందుకే సినిమా ఇండస్ట్రీని వదిలేశా..

తమిళ్, కన్నడ, మలయాళ సినిమాల్లో నటిస్తూ వచ్చిన హానీ రోజ్‌కి ‘వీర సింహా రెడ్డి’ సెకండ్ ఇన్నింగ్స్ లాంటిదే. 32 ఏళ్ల వయసులో బాలకృష్ణకి తల్లిగా, తన కంటే వయసులో పెద్దదైన శృతి హాసన్‌కి అత్తగా నటించింది హనీ రోజ్. గ్లామర్ చూపించింది ఒక్క సీన్‌లోనే అయినా తన అందంతో మ్యాజిక్ చేసేసింది.

Honey Rose

ఈ మూవీ తర్వాత హానీ రోజ్ తెలుగులో బిజీ అయిపోతుందని అనుకున్నారంతా. క్రేజ్ అయితే వచ్చింది కానీ అవకాశాలు మాత్రం రావడం లేదు. దీనికి ప్రధాన కారణం ‘వీర సింహా రెడ్డి’ మూవీయే. బాలయ్యకే తల్లిగా నటించడంతో యంగ్ హీరోలు, ఈమెను హీరోయిన్‌గా తీసుకోవడానికి వెనకాడుతున్నారు. చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున వంటి సీనియర్లు కూడా స్టార్ హీరోయిన్ల వైపే ఇంట్రెస్ట్ చూపిస్తుండడంతో హానీ రోజ్‌కి అవకాశాలు రావడం లేదు.

బాలయ్యని టార్గెట్ చేస్తున్న కోలీవుడ్.. విచిత్ర కామెంట్స్ తర్వాత రాధికా ఆప్టే వ్యాఖ్యలు వైరల్..

‘వీరసింహా రెడ్డి’ విడుదలై 11 నెలలు కావస్తున్నా తెలుగులో మరో సినిమా చేయలేదు హానీ రోజ్. మలయాళంలో మాత్రం నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. అలాగే షాప్స్, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ తో రెండు చేతులా సపాదిస్తుంది హానీ రోజ్.

టెక్ మానభంగాలను అడ్డుకునే దారేది? డీప్ ఫేక్ కేవలం ఆరంభమేనా..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post