Beauty Tips Black Neck : తరచుగా మనం మన ముఖం, చేతులు, కాళ్ళ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకుంటాము కానీ మెడను (Neck) విస్మరిస్తుంటాం. ముఖం ఉండే రంగులో కాకుండా మెడ నల్లగా ఉండడం అనే సమస్య చాలా మందినే ఇబ్బంది పెడుతుంది. చాలామందికి మెడ భాగంలో నల్లగా ఉంటుంది. అది ఎంత క్లీన్ చేసిన పోదు, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది చూడనికి, ఎక్కువ చెమట పట్టడం వల్ల లేదంటే మనం వేసుకునే జువెలరీ వల్ల లేదా కొంతమందికి ప్రెగ్నెంట్ టైంలో, థైరాయిడ్ లేక మరి ఏదైనా ఇతర హెల్త్ కారణాల వల్ల కూడా మెడ భాగం చాలా నల్లగా అయిపోతుంది. అలాంటప్పుడు ఈ చిట్కాలు ఫాలో అవ్వండి చాలా బాగా పని చేస్తుంది.
మొదటి చిట్కా: కాఫీ పౌడర్ (నార్మల్ కాఫీ పౌడర్ కాదు ఫిల్టర్ కాఫీ పౌడర్) ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి. అందులో కొంచెం పంచదార నాలుగు చుక్కలు తేనె వేసుకొని బాగా మిక్స్ చేసి మెడ భాగానికి, మోచేతులు, మోకాలు, అలాగే మీకు నల్ల మచ్చలు ఎక్కడున్నా అప్లై చేసి ఒక రెండు నిమిషాలు మర్దన చేసుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది.
రెండో చిట్కా: నిమ్మ చెక్క రసం తీసేసి రివర్స్ చేసి దానిపైన కొంచెం పంచదార వేసి స్క్రబ్బర్ల మెడ భాగాన్ని ఐదు నిమిషాల వరకు రుద్ది తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుంది.
మూడవ చిట్కా: బంగాళదుంప తొక్క తీసేసి అందులో చిటికెడు పసుపు వేసి మిక్సీ పట్టీ, దాన్ని మెడ భాగానికి అప్లై చేసి ఆరిన తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని మీరు ఐస్ క్యూబ్ లో వేసి ఫ్రిజ్లో పెట్టుకొని రెగ్యులర్ గా కూడా వాడుకోవచ్చు. వారం రోజులు అయినా స్టోర్ చేసుకోవచ్చు.
అసలు మెడ భాగం నల్లగా అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. మనం ఫేస్ కి ఎలాంటి క్రీమ్ లోషన్స్ సన్ స్క్రీన్ అప్లై చేసినా దాన్ని మెడకి కూడా Use చేయాలి. కేర్ ఫేస్ వరకే కాకుండా మెడ భాగాన్ని కూడా తీసుకోవాలి. ఆంటిక్ జువెలరీస్ ఏమన్నా వేస్తే తీసిన వెంటనే నెక్ వాష్ చేసుకుని ఏదైనా బాడీ లోషన్ రాసుకోవాలి. ఏదైనా హెల్త్ ఇష్యూ వల్ల మాత్రం అలా అయితే డాక్టర్ ని సంప్రదించి మెడిసిన్ వాడడం మంచిది.
చెంచుల కడుపు నింపుతున్న భూచక్రగడ్డ..