బోల్డ్ సీన్స్ చేయలేక ‘ఉప్పెన’ వదులుకున్నా! ‘అర్జున్ రెడ్డి’ వచ్చి ఉంటే వేరేలా ఉండేది..

Shivani Rajashekar : జీవిత, రాజశేఖర్ దంపతుల ఇద్దరు కూతుళ్లు హీరోయిన్లుగా సక్సెస్ అవ్వాలని తెగ ప్రయత్నిస్తున్నారు. చిన్న కూతురు శివాత్మిక, చిన్న దేవరకొండ ఆనంద్‌తో ‘దొరసాని’ మూవీతో ఎంట్రీ ఇవ్వగా.. పెద్ద కూతురు శివానీ కోసం భారీ ప్లాన్సే చేసింది జీవిత రాజశేఖర్.

శ్రీకాంత్ సినిమాకి కలిసి వస్తున్న ‘ఆదికేశవ’రిజల్ట్.. ‘కోటబొమ్మాళి పీఎస్’కి పెరుగుతున్న కలెక్షన్లు..

హిందీలో సూపర్ హిట్టైన ‘టూ స్టేట్స్’ మూవీని తెలుగు, తమిళ భాషల్లో అడవి శేష్, శివానీ జంటగా తెరకెక్కించాలని అనుకున్నారు. సినిమా మొదలై, కొన్ని రోజులు షూటింగ్ కూడా జరిగింది. అయితే అనుకోకుండా ఈ ప్రాజెక్ట్ నుంచి అడవి శేష్ తప్పుకోవడంతో మూవీ మధ్యలోనే ఆగిపోయింది.

Shivathmika Rajashekar

ఆ తర్వాత తేజ సజ్జతో కలిసి ‘అద్భుతం’మూవీతో ఎంట్రీ ఇచ్చింది శివానీ. కాన్సెప్ట్ అద్భుతంగా ఉన్నా, నేరుగా ఓటీటీలో రిలీజ్ కావడంతో శివానీకి రావాల్సినంత క్రేజ్ రాలేదు. తాజాగా ‘కోటబొమ్మాళి పీఎస్’ మూవీతో థియేటర్లలోకి వచ్చిన శివానీ, కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

తెలంగాణ పోరు! రాష్ట్రం వచ్చి దశాబ్దం దాటినా మా రాతలు మారలేదు దొరా..!

‘‘నిజానికి ‘ఉప్పెన’ మూవీ నేనే చేయాల్సింది. అయితే నాకు కథ చెప్పినప్పుడు అందులో బోలెడన్ని లిప్ లాక్ సీన్స్, బోల్డ్ సీన్స్ ఉన్నాయి. రాజశేఖర్, జీవిత కూతురిగా నేను ఆ పాత్ర చేస్తే జనాలు ఒప్పుకోరని అనిపించి, దాన్ని రిజెక్ట్ చేశా.

విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ చూశాక, హీరోయిన్ నాకెందుకు రాలేదని అనిపించింది. ఆ క్యారెక్టర్ నాకు అంత నచ్చింది..’ అంటూ వ్యాఖ్యానించింది శివాని రాజశేఖర్. ‘ఉప్పెన’ కంటే ‘అర్జున్ రెడ్డి’ మూవీలో లిప్ లాక్ సీన్స్ ఎక్కువ. దీంతో శివానికి ఎందుకు అలా అనిపించిందోనని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు.

బాలయ్యని టార్గెట్ చేస్తున్న కోలీవుడ్.. విచిత్ర కామెంట్స్ తర్వాత రాధికా ఆప్టే వ్యాఖ్యలు వైరల్..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post