Love Failure : ఉన్నది ఒకటే జిందగీ..

Love Failure : మనం ప్రేమలో ఉన్నప్పుడు.. మనసు సప్తవర్ణాల సీతాకోక చిలుకలా.. ఆకాశంలో ఎగిరిపోతుంది.

సుతి మెత్తగా తొలి వేకువ జామున, రేకులు విచ్చుకున్న గులాబీ పువ్వులా.. హృదయం చిరునవ్వయి విచ్చుకుంటుంది.
గరిక పచ్చటి మైదానాల్లో నడుస్తున్న పాదాలపై, మంచు బిందువులు.. ముద్దు పెట్టుకున్నప్పటి పులకింతలా ఏదో తెలియని అలౌకిక భావన లోలోన మేల్కొని,
ఈ ప్రపంచంలో “అతడు/ ఆమె” తప్పా, మరేమీ కనిపించని, వినిపించని వైచిత్రిలో మనసుంటుంది..

ప్రియాంక మోహన్ ‘లవ్’లో ప్రభాస్.. ఆ ఇద్దరికీ బ్రేకప్..

అదే ప్రేమ విఫలమైతే..
ఈ ప్రపంచమంతా ఒక్కసారిగా.. అంధకారమైనట్లనిపిస్తుంది.
జీవితం ఇంతటితో ముగిసిందని
లోలోన కుమిలిపోయే వాళ్ళు కొందరైతే
ప్రాణాలు పణంగా పెట్టే వాళ్ళు మరికొందరు..!

లవ్ ఫెయిల్యూర్.. ఈ సిట్యుయేషన్ ని చాలామంది ఏదో ఒక సమయంలో ఫేస్ చేసే/చేస్తూ ఉంటారు.. కానీ అందులో నుంచి బయటపడి జీవితాన్ని ముందుకు సాగించే వాళ్ళే లైఫ్ లో సక్సెస్ అవుతారు.
‘రాజా రాణి’ మూవీలో చెప్పినట్టు.. “లవ్ ఫెయిల్యూర్ తర్వాత లైఫే లేదనుకుంటే.. 25 ఏళ్ళ తర్వాత ఎవరూ బ్రతకరు. లవ్ ఫెయిల్యూర్ తర్వాత కూడా లైఫ్ ఉంటుంది”.

Love Failure

ప్రేమించిన అమ్మాయి/అబ్బాయి వదిలేస్తే చావడమో, చంపుతానని బెదిరించడమో.. యాసిడ్ పోస్తానని భయపెట్టడమో కాదు.. ఎదగాలి కసి కొద్దీ జీవితంలో పైకి ఎదగాలి. మన ఎదుగుదల చూసి మనల్ని చిన్నచూపు చూసిన వాళ్ళు సిగ్గుపడేలా ఎదగాలి. లవ్ లో ఫెయిల్ అయితే లక్ష్యం వైపు గురిపెట్టి.. నీ పట్టుదలని దాని మీద చూపించాలి.

పుట్టిన ప్రతి ఒక్కరికీ ఓ లవ్ స్టొరీ ఉంటుంది. ఉండటం గొప్పకాదు.. దమ్ముంటే దాన్ని జీవితాంతం కాపాడుకోవాలి లేదా మధ్యలో మిమ్మల్ని ఎవరైనా విడిచి వెళ్తే.. గెలిచి నిలబడాలి.

రష్మికకి ముందు ఓ అమ్మాయిని ప్రేమించి, మోసపోయిన రక్షిత్ శెట్టి.. ఈ లవ్ స్టోరీ వింటే..

లవ్ ఫెయిల్యూర్ అయితే బాధ ఉండదా అంటే.. ఉంటుంది.
ఎన్ని రోజులు బాధ పడతావు ఓ 30 రోజులు.. లేదా 400 రోజులు…!? సరే బాధ పడి ఏం సాధిస్తావు!? పోయిన అతను/ఆమె తిరిగొస్తారా.. రారు కదా.. అందుకే మూసుకొని పని చూసుకో..
నీ కన్నా డబ్బు ఉన్నవాడో/అందమైనది దొరికిందనో వాళ్ళు వెళ్లిపోతే.. ఇంత తొందరగా వాళ్ళ బుద్ధి బయట పడిందని సంతోషించు.. జీవితాంతం వాళ్ళతో కలిసి ప్రయాణించాలని నువ్వు మాత్రమే అనుకుంటే సరిపోదు కదా..!?

నో నట్ నవంబర్.. అసలేంటి NNN! ఆపుకోవడం మంచిదేనా..

అందుకే బుర్రకి ప్రేమతో పాటు మరపు కూడా నేర్పాలి. నిన్ను.. నీ ప్రేమని అర్ధం చేసుకోకుండా వెళ్లిన వాళ్ల మీద జాలిపడు.. నీలాంటి వాళ్ళని మిస్ చేసుకున్నందుకు ఆ తర్వాత ఎలాగూ వాళ్ళు బాధపడతారు. పొరపాటున వాళ్ళు నీకెప్పుడైనా ఎదురైతే.. ఓ చిరునవ్వు చిందించు.. అంతకన్నా మన విధించే శిక్ష ఇంకోటి ఉండదు. కాలం చాలా విలువైంది పోయినా వాళ్లకోసం ఆలోచిస్తూ.. వృథా చేయకు.. ఉన్నది ఒకటే జిందగీ మిత్రమా..

ప్రేమ.. ‘ప్రేమ’నే ఇస్తుందా..!?

By Dhana Sri

I'm Telugu content writer with 2 years of Experience. I can write any vertical articles but specialist in Cooking and Spiritual writing.

Related Post