రేంజ్ పెంచేస్తున్న అల్లు అర్జున్… ‘పుష్ప’ తర్వాత తగ్గేదే లే! త్రివిక్రమ్‌తో సినిమాకి..

Allu Arjun Trivikram : ‘పుష్ప’ మూవీతో బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డు దక్కించుకున్న అల్లు అర్జున్, కెరీర్‌ను పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటిదాకా రాజమౌళితో సినిమా చేయకుండా పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ తెచ్చుకున్న తొలి తెలుగు నటుడు అల్లు అర్జున్. వచ్చే ఐదేళ్లలో రాజమౌళి- అల్లు అర్జున్ కాంబోలో మూవీ రావడం లేదు. అయితే జక్కన్నతో సినిమా చేయకపోయినా తన కెరీర్ ప్లానింగ్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు బన్నీ…

‘జల్సా’ కోసం మహేష్.. ‘గుంటూరు కారం’ కి తిరిగి ఇచ్చేస్తున్న పవన్ కళ్యాణ్..

‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్, ‘జవాన్’ ఫేమ్ అట్లీతో మూవీ చేయబోతున్నాడు. అయితే ఈ మూవీ ఇంకా అధికారికంగా అనౌన్స్‌మెంట్ స్టేజీకి రాలేదు. ఈలోపు అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో నాలుగో మూవీ రానుంది. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురంలో’ సినిమాలు సూపర్ హిట్టయ్యాయి.

Allu Arjun Trivikram

అయితే ఈసారి యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ కాకుండా సోషియో ఫాంటసీ కాన్సెప్ట్‌తో భారీ బడ్జెట్‌తో మూవీ చేయబోతున్నారు బన్నీ – త్రివిక్రమ్. ఈ మూవీ ప్రీ పొడక్షన్ పనులకే ఏడాదిన్నర సమయం పడుతుందట. ఈలోపు అల్లు అర్జున్, అట్లీ సినిమా మొదలుకాకపోతే బోయపాటి శ్రీనుతో మూవీ మొదలెడతాడు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ‘సరైనోడు’ మూవీ, అల్లు అర్జున్‌కి మంచి మాస్ ఇమేజ్ తెచ్చి పెట్టింది.

ప్రపంచ కప్ విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? ఓడినా తక్కువేమీ కాదు..

అయితే బోయపాటి శ్రీను ఇంకా అల్లు అర్జున్‌కి పూర్తి స్క్రిప్ట్ వినిపించలేదట. ‘పుష్ప 2’ షూటింగ్ ముగిసేలోపు బోయపాటి, పూర్తి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయకపోతే అల్లు అర్జున్.. వేరే డైరెక్టర్లతో పనిచేస్తాడు. మలయాళంలో ‘భీష్మ’, ‘బిగ్ బీ’, ‘కామ్రేడ్ ఇన్ అమెరికా’ వంటి సినిమాలు తీసిన అమల్ నీరద్‌తో బన్నీ సినిమా ఉంటుందని కూడా టాక్. అలాగే సందీప్ రెడ్డి వంగాతో కూడా పనిచేయాలని ఆశతో ఉన్నాడు అల్లు అర్జున్.

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post