Telangana State : పుట్టిన ఊరు.. చిన్నప్పటి నుంచి పెరిగిన ఊరు అంటే అందరికీ ఒక ఎమోషన్. అలానే తెలంగాణ పోరు కూడా! సరిగ్గా దీన్నే ఎమోషనల్గా క్యాష్ చేసుకున్నాయి పొలిటికల్ పార్టీలు. లోకల్ గా ఒకప్పటి TRS.. ఇప్పుడు BRS పార్టీ.. అప్పటి హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ..
ఎవరికీ వారు అధికారంలోకి రావడానికి.. భారీ ప్లాన్స్ వేశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోవడాన్ని ఆయుధంగా వాడుకున్నాయి. అయితే కాంగ్రెస్ వేసిన ప్లాన్ పల్టీ కొడితే, దీని వల్ల ఎక్కువగా లబ్ది పొందింది మాత్రం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR). జనాలను ఎమోషన్ ట్రామాలో పడేసి 10 సంవత్సరాలు CM గా కొనసాగిన కేసీఆర్, మరోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కడమూ దాదాపు ఖాయమేనని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
కేంద్ర రాజకీయాల్లోకి కేసీఆర్? వారసుడి ప్లేస్ కోసం కేటీఆర్, హరీశ్ రావు మధ్య పోటీ..
ప్రత్యేక తెలంగాణా ఇస్తే, టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని మాట ఇచ్చాడు కేసీఆర్. అలాగే ఓ దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానని కూడా గొప్పగా ప్రకటించాడు. అయితే ఎన్నికల్లో భారీ మెజారిటీ దక్కడంలో ఆ రెండు వాగ్దానాలను తుంగలో తొక్కేశాడు.
తెలంగాణ రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్ పార్టీ భారీగా నష్టపోయింది. అయితే తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాడిన ఆ 6 లక్షల మంది తెలంగాణ వాదులు.. అసలు ఏమైపోయారు. రాష్ట్రం విడిపోవాడంతోనే వాళ్ళ పని అయ్యిపోయిందా.. వాళ్ళు కోరుకున్న బంగారు తెలంగాణ ఇదేనా..
వాళ్ళకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడలేని ఆ గొంతులు ఇప్పుడు మూగబోయాయా.. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రాతో కలిసి ఉన్నప్పుడు, విడిపోయినప్పుడు తేడా ఏంటీ..? తెలంగాణ వాదులు ఎదురు చూసిన అభివృద్ధి ఏది? ఎక్కడ?
ప్రత్యేక రాష్ట్రం వస్తే హైదరాబాద్లో భూముల రేట్లు తగ్గుతాయని, సొంత ఇంటి కల నెరవేరుతుందని నిరుపేదలు, మన రాష్ట్రం వస్తే మనకంటూ ఉద్యోగాలు వెల్లువెత్తుతాయని నిరుద్యోగులు, సాగు నీరు కష్టాలు ఉండవని రైతులు.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పోరాట యోధులుగా మారారు. కొన్ని వందల మంది విద్యార్థులు సమిధలుగా మారారు.
దొంగ చేతికి తాళాలివ్వడం అంటే ఇదే..
అయితే కొత్త రాష్ట్రం వచ్చాక హైదరాబాద్ జిగేలు అందాలు చూపించి, అభివృద్ధి అని నమ్మిస్తోంది టీఆర్ఎస్. గత 10 ఏళ్లలో ఎన్నో నోటిఫికేషన్లు అయితే వచ్చాయి, అయితే ఇచ్చిన ఉద్యోగాల లెక్క మాత్రం చాలా తక్కువ.
తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన వారిలో నాయకులు… చాలామంది, రకరకాల రాజకీయ పార్టీల్లో సెటిల్ అయిపోయారు. ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఆశపడిన వాళ్లు, ఆశలు సచ్చిపోయి ప్రైవేటు ఉద్యోగాల్లో చాలీచాలని జీతంతో బతుకు ఈడుస్తున్నారు.
సొంత ఇంటి కల నెరవేరుతుందని ఆశపడిన నిరుపేదలు, అద్దెలు కట్టుకోలేక, పెరిగిన ఖర్చులను తట్టుకోలేక బిక్కుబిక్కుమంటూ బతుకు ఈడుస్తున్నారు. నా తెలంగాణ, రతనాల సీమ అంటూ పాటపాడిన కళాకారులు, పొట్టనిప్పుకోవడానికి కూలీ పనులు చేస్తున్నారు.
బాలయ్యని టార్గెట్ చేస్తున్న కోలీవుడ్.. విచిత్ర కామెంట్స్ తర్వాత రాధికా ఆప్టే వ్యాఖ్యలు వైరల్..
ఒకప్పుడు నక్సలైట్లకు భయపడి, ఊరు వదిలి పారిపోయిన దొరలు, పెత్తందారులు.. తెలంగాణ జెండా పట్టుకుని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పేరు చెప్పి.. తిరిగి ఊర్లలోకి వచ్చారు. మా రాష్ట్రం వస్తే మార్పు వస్తుందని ఆశపడిన ఊరి జనాలు, మళ్లీ అదే వెట్టి చాకిరి చేస్తూ, సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వం వేసే బిక్షను పరమాన్నంగా తింటూ బతుకుతున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజల బతుకులు మారాలంటే ప్రత్యేక రాష్ట్రాలు కాదు, ప్రజల్లోనే మార్పు రావాలని మరోసారి మన తెలంగాణ నిరూపించింది.