Sugar Control Food : గత కొన్నేళ్లుగా మన జీవనశైలిలో వచ్చే మార్పులతో ఊబకాయం సమస్య పెరిగిపోతోంది. అధిక బరువు కారణంగా డయాబెటిస్, గుండెపోటు, రక్తపోటు వంటి అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే ఈ రోజుల్లో అధిక బరువు, వయసుతో సంబంధం లేకుండా షుగర్ ఎటాక్ అవడం చాలామందిలో చూస్తూనే ఉన్నాం. మనం తీసుకునే ఆహారంలో చిన్నచిన్న మార్పులు చేసుకుంటే మన ఆరోగ్యం 80% మన చేతుల్లోనే ఉంటుంది.
ముత్యమంతా పసుపు.. ముఖమెంతో ఛాయా..
బరువు తగ్గడం, షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండాలనుకునే వారు భోజనానికి ముందు పండ్లు తీసుకోండి..
* పండ్లు తీసుకోవడం వలన శరీరానికి కావాల్సిన విటమిన్స్, పీచు పదార్థాలు, మినరల్స్, యాంటీ-ఆక్సిడెంట్లు అందుతాయి. తద్వారా జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది.
* భోజనానికి ముందు పండ్లు తీసుకోవడం వలన సగం కడుపు నిండి.. ఆహారం తక్కువగా తీసుకొంటారు.
* ఆపిల్, జామ, ద్రాక్ష, బత్తాయి తొనలు అంటే.. తొక్కతో పాటు తినగలిగే పండ్లను, తొక్కతో పాటే తినాలి. ఎందుకంటే శరీరానికి కావాల్సిన ఎక్కువ పీచుపదార్థం తొక్కల్లోనే ఉంటుంది.
* పండ్లు తినడం అలవాటు చేసుకొంటే.. వ్యాధి నిరోధకశక్తి పెరగడంతో పాటు మన బరువు, షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
* పండ్లు తినే ముందు వాటిని ఒక 3 నిముషాలు ఉప్పు నీటిలో ఉంచి.. తర్వాత మంచి నీటిలో కడిగి తినాలి. ఎందుకంటే ఆపిల్ లాంటి పండ్లు ఎక్కువ నిల్వ ఉండడానికి కెమికల్ పూతలు పూస్తారు.
మానసిక సమస్యల కారణంగా ఆందోళన, ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో చాలా హార్మోన్లు విడుదలౌతాయి. ఈ హార్మోన్స్ శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ని అమాంతం పెంచేస్తాయి. సో.. ఫ్రూట్స్ తినడం వల్ల మానసిక ప్రశాంతత కల్గుతుంది. తద్వారా షుగర్ ను కొంత వరకు కంట్రోల్ లో ఉంచే అవకాశం ఉంటుంది.
హెయిర్ ఫాల్ సమస్యకి సింపుల్ చిట్కా..