Vaishnav Tej Aadikeshava Movie Review : ‘ఉప్పెన’ మూవీత హీరోగా మారిన మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘ఆదికేశవ’. క్రేజీ హీరోయిన్ శ్రీలీల కారణంగా ఈ మూవీకి అంతో కొంతో క్రేజ్ వచ్చింది. ట్రైలర్‌లో కూడా శ్రీలీల గ్లామర్‌నే హైలైట్ చేశాడు డైరెక్టర్. ‘ఉప్పెన’ తర్వాత క్రిష్‌తో ‘కొండపొలం’ మూవీ చేసిన వైష్ణవ్ తేజ్, ఆ తర్వాత ‘రంగ రంగ వైభవంగా’ అనే మూవీ చేశాడు. ఆ మూవీ వచ్చిందీ, ఎవ్వరికీ తెలియకుండానే పోయింది.. ‘ఆదికేశవ’ మూవీకి పెద్దగా బజ్ కూడా రాలేదు.
‘యానిమల్’ని భయపెడుతున్న రన్ టైమ్..
విడుదలకు ముందు ప్రమోషన్ చేసి, జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా.. అవుట్ పుట్ పెద్దగా వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు. మొత్తానికి ‘ఆదికేశవ’ మూవీ ఎలా ఉందంటే..
మొదటి రెండు సినిమాల కోసం విభిన్నమైన కథలను సెలక్ట్ చేసుకున్న వైష్ణవ్ తేజ్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌ల మాదిరిగా మాస్ ఇమేజ్ కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే ‘ఉప్పెన’లో మిగిలిన వాళ్ల పర్ఫామెన్స్ కారణంగా వైష్ణవ్‌కి పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. ‘కొండపొలం’ మూవీలో నటుడిగా తేలిపోయిన వైష్ణవ్, ‘ఆదికేశవ’ మూవీ కోసం తన ఇమేజ్‌కి మించిన పాత్రను సెలక్ట్ చేసుకున్నాడు. నటుడిగా వైష్ణవ్ తేజ్ చాలా ఎదగాల్సిన అవసరం ఉంది.
‘MAD’ మూవీలో సీనియర్‌గా నటించిన శ్రీకాంత్ ఎన్.రెడ్డి ఈ ‘ఆదికేశవ’ డైరెక్టర్. మాస్ సబ్జెక్ట్ సెలక్ట్ చేసుకున్న శ్రీకాంత్, దాన్ని తెరకెక్కించడంలో రొటీన్ మాస్ ఫార్ములానే నమ్ముకున్నాడు.. వీడెవడో మరో బోయపాటిలా అనిపిస్తుంది. కామెడీ కోసం పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి హీరోల పాటలు, స్టెప్పులను వేయించి శ్రీలీలతో ఇమిటేట్ చేయించాడు.
అక్కినేని ఫ్యామిలీ ఫేడ్ అవుట్ అయిపోయినట్టేనా..!?
ఈ మూవీకి శ్రీలీల గ్లామర్, డ్యాన్సులే ప్రధాన బలం. ‘ధమాకా’ తర్వాత శ్రీలీల అంత గ్లామరస్‌గా కనిపించడమే కాకుండా తన డ్యాన్స్‌లతో ‘ఆదికేశవ’ మూవీని లాక్కొచ్చే ప్రయత్నం చేసింది. జీ.వీ. ప్రకాశ్ మ్యూజిక్ సోసోగా ఉంది కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో ఇంప్రెస్ చేశాడు. ట్రైలర్‌లో చూపించినట్టుగా గొడ్డలితో మంట పుట్టించి, ఆ మంటల్లో బీడీ వెలిగించుకోవడం వంటి కొన్ని మాస్ ఎలిమెంట్స్ బీ, సీ సెంటర్ల జనాలకు నచ్చుతాయి.
కథ, కథనం, స్క్రీన్ ప్లే గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. మలయాళ నటుడు జోసఫ్ జార్జ్‌ని సరిగ్గా వాడుకోలేదనే అనిపిస్తుంది. మొత్తంగా ‘ఆదికేశవ’ మూవీలో కొత్తగా చూసింది ఏమీ లేదనే ఫీలింగ్ మాత్రం కలుగుతుంది. వైష్ణవ్ తేజ్ అన్న సాయిధరమ్ తేజ్‌కి యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. యూత్‌కి తగ్గట్టుగా కథల ఎంపికలోనూ చాలా వైవిధ్యం చూపిస్తున్నాడు తేజ్.
బాలీవుడ్‌లో సాయి పల్లవి! ఏకంగా ఆమీర్ ఖాన్ కొడుకుతో సినిమా… ఆ సీన్స్ చేస్తుందా..
‘సుప్రీం’ తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమైన సాయి ధరమ్ తేజ్, ‘చిత్రలహరి’, ‘ప్రతీరోజూ పండగే’ నుంచి స్టోరీ సెలక్షన్ పై చాలా ఫోకస్ పెట్టాడు. అంతకుముందు సినిమాలు ఆడకపోయినా నటుడిగా తేజ్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. కాబట్టి వైష్ణవ్ తేజ్, అన్న దగ్గర పాఠాలు నేర్చుకుని, కెరీర్ నిర్మించుకుంటే బాగుంటుంది.