‘యానిమల్’ని భయపెడుతున్న రన్ టైమ్..

Ranbir Kapoor’s Animal : ‘అర్జున్ రెడ్డి’ వంటి యూత్‌ ఫుల్ వైల్డ్ లవ్ స్టోరీ తర్వాత సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘యానిమల్’. 2020 డిసెంబర్‌లో మొదలైన ఈ సినిమా, మూడేళ్లకు థియేటర్లలో దిగబోతోంది. వైల్డ్ అంటే ఎలా ఉంటుందో బాలీవుడ్‌కి ఛాలెంజ్ చేసిన సందీప్ రెడ్డి వంగా, ట్రైలర్‌లో దాన్ని పరిచయం చేశాడు కూడా..

ప్రియాంక మోహన్ ‘లవ్’లో ప్రభాస్.. ఆ ఇద్దరికీ బ్రేకప్..

చిన్నప్పటి నుంచి ప్రేమ చూపించకుండా పెంచిన తండ్రి కోసం అత్యంత క్రూరంగా హత్యలు చేసే కొడుకుగా రణ్‌బీర్ కపూర్ కనిపించబోతున్నాడు. రష్మిక మంధాన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో రణ్‌బీర్ తండ్రిగా అనిల్ కపూర్‌, విలన్‌గా బాబీ డియోల్ నటిస్తున్నారు.

Ranbir Kapoor’s Animal

అయితే ఈ మూవీ రన్ టైం‌ని అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. సెన్సార్ నుంచి క్లియర్‌ A సర్టిఫికెట్ పొందిన ‘యానిమల్’ రన్ టైమ్ 3 గంటల 21 నిమిషాల 23 సెకన్లు. టాలీవుడ్ వండర్ ‘బాహుబలి: ది కంక్లూజన్’ రన్ టైమ్ 3 గంటల 17 నిమిషాలు. ‘బాహుబలి’ మూవీలో వార్ సన్నివేశాలు ఉండడంతో పాటు పార్ట్ 1 సూపర్ సక్సెస్ కావడంతో వర్కవుట్ అయ్యింది. ‘యానిమల్’ దానికి మించిన రన్ టైమ్‌తో వస్తోంది.

నిత్యా మీనన్‌తో అలాంటి సీన్ చేయించాలనుకున్న చిత్ర యూనిట్.. హీరోయిన్ చేసిన పనికి..

రవితేజ హీరోగా వచ్చిన ‘టైగర్ నాగేశ్వరరావు’ 3 గంటల 2 నిమిషాల రన్ టైమ్‌తో థియేటర్లలో విడుదలైంది. ఇదే ‘టైగర్‌’కి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్‌గా మారింది. రిలీజ్ తర్వాత 25 నిమిషాలు కత్తిరించినా అప్పటికే ఆలస్యం జరిగిపోయింది.

ఇప్పుడు ‘యానిమల్’ విషయంలోనూ అదే జరుగుతుందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఇంత లెంగ్త్ ఉన్న మూవీ ఏదీ రాలేదు. ఇది ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుందా? ఎమోషనల్ రైడ్‌లో సక్సెస్ అవుతుందో తెలియాలంటే డిసెంబర్ 1 వరకూ వేచి చూడాల్సిందే.

SSMB29 కోసం సూపర్ స్టార్ కి జక్కన్న కండీషన్స్..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post