Prabhas – Hanu Raghavapudi : ‘బాహుబలి’ సునామీ నుంచి బయటికి వచ్చేందుకు చాలా కష్టపడుతున్నాడు ప్రభాస్. ‘బాహుబలి’ తర్వాత నాలుగు సినిమాలు చేసినా ఒక్కటి కూడా ప్రాఫిట్స్ తెచ్చిపెట్టలేదు. ఇప్పుడు ప్రభాస్ ఫోకస్ అంతా ‘సలార్’పైనే ఉంది. ‘సలార్’ షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్, నాగ్ అశ్విన్‌తో చేస్తున్న ‘కల్కీ’ మూవీకి షిఫ్ట్ అయ్యాడు.
రికార్డులు దున్నేందుకు ‘సలార్’ మాస్టర్ ప్లాన్.. ఒక్క కర్ణాటకలోనూ వెయ్యికి పైగా థియేటర్లు..
ఈ మూవీతో పాటు కామెడీ చిత్రాల దర్శకుడు మారుతితో చేస్తున్న ‘రాజా డీలక్స్’ మూవీని కూడా పూర్తి చేసే పనిలో పడ్డాడు ప్రభాస్. ఈ మూవీ తర్వాత ‘సలార్ పార్ట్ 2’ మూవీ ఉంటుంది. ఈ మూడు సినిమాలు అయ్యే సరికి ఎంత లేదన్నా నాలుగైదు ఏళ్లు పడుతుంది.
ఈ గ్యాప్‌లో ప్రభాస్ లైనప్‌లో మరో సినిమా చేరింది. ‘సీతారామం’ మూవీతో మంచి హిట్టు కొట్టిన హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ లవ్ స్టోరీ చేయబోతున్నాడని సమాచారం. రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కబోతుందట.
38 భాషల్లో సూర్య ‘కంగువా’ మూవీ.. త్రీడీలో కూడా..
ఇంతకుముందు ఇలాగే ఓ చిన్న లవ్ స్టోరీగా మొదలైన ‘రాధేశ్యామ్’ బడ్జెట్ భారీగా పెరిగిపోయి, బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా మిగిలింది. ఇప్పుడు మరోసారి ఓ లవ్ స్టోరీకి రూ.300 కోట్లు పెట్టడం అంటే చాలా రిస్క్ చేయడమే అవుతుంది.
లావణ్య త్రిపాఠి డిబేట్ మూవీ ‘అందాల రాక్షసి’తో ఎంట్రీ ఇచ్చిన హను రాఘవపూడి, నాలుగేళ్ల గ్యాప్ తీసుకుని నానితో ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ తీశాడు. ఆ తర్వాత నితిన్‌తో చేసిన ‘లై’ ఫ్లాప్. ఆ తర్వాత ఏడాది వచ్చిన ‘పడి పడి లేచే మనసు’ కూడా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు రాబట్టలేక పడిపోయింది. ‘సీతా రామం’ మాత్రం బాక్సాఫీస్ దగ్గర త్రిబుల్ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టింది. ప్రభాస్‌తో చేసే సినిమా మరో ‘సీతారామం’ కాకపోయినా పర్లేదు కానీ, మరో ‘రాధేశ్యామ్’ కాకూడదని కోరుకుంటున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్.
త్రిషను రేప్ చేయాలని అనుకున్నా! ‘లియో’ నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ షాకింగ్ కామెంట్స్..