Megastar Chiranjeevi : మెగాధీరుడు..

Megastar Chiranjeevi
Megastar Chiranjeevi

Megastar Chiranjeevi : స్వయం కృషి.. ఈ పేరు వినగానే మొదట గుర్తుకు వచ్చే వ్యక్తి “శివ శంకర వర ప్రసాద్”. సినిమా అంటే ఆయన, ఆయన అంటే సినిమా. ఈ తరానికి, అందులోనూ తెలుగువారికి అతను ఒక స్ఫూర్తి. ఆయన కఠోర తపస్సు చేసిన చిరంజీవుడు. తెలుగు సినిమాలో అతను ఓ అధ్యాయం కాదు డిక్షనరీ. తెలుగు సినిమా చిరంజీవికి ముందు, చిరంజీవికి తరవాత అని చెప్పుకునేలా మారిపోయింది. తనలో ప్రావీణ్యం, సహనం నమ్ముకుని ఆ కళామాతల్లి ఒడికి జగదేక వీరుడుగా చేరాడు. కానీ ఆ స్థాయికి చేర‌డానికి చేసిన జ‌ర్నీ మాత్రం సాధార‌ణమైంది కాదు, సామాన్యులకు అంత సులభం కాదు.

మెగాస్టార్ గా చిరంజీవి నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో అగ్ర క‌థానాయ‌కుడిగా రాణించ‌డమే కాకుండా, సామాజిక సేవ‌లోనూ త‌న‌వంతు బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తూ మహోన్నతమైన శిఖ‌రం చేరుకున్న వ్య‌క్తి చిరంజీవి. పరిశ్రమలో ఎదగడానికి గుణపాఠాల దగ్గర శిష్యరికం చేసిన ఏకలవ్యుడు. అగ్ర కథానాయకుడిగా బాక్సాఫీస్‌ను బద్ధలుకొట్టిన చిరంజీవి ప్రయాణంలో నేర్చుకున్న పాఠాలెన్నో. 1978లో పునాది రాళ్లు నుంచి సినిమాతో నటుడిగా కెరీర్‌ ప్రారంభించినా.. ప్రాణం ఖరీదు మాత్రం ముందు విడుదల కాగా.. మొదటి చిత్రం మూడో చిత్రంగా విడుదలైంది.

Chiranjeevi Gharana Mogudu : వాళ్ళను కాపీ కొట్టి డైలాగ్స్‌, మేనరిజం..

హీరోగానే కాకుండా, నెగిటివ్ షేడ్స్‌, కీల‌క పాత్ర‌ల్లో న‌టించి మెప్పించారు. మనవూరి పాండవులు, తాయరమ్మ బంగారయ్య, ఇది కథ కాదు, శ్రీరామబంటు, కోతలరాయుడు, పున్నమినాగు, మొగుడు కావాలి, న్యాయం కావాలి, చట్టానికి కళ్ళులేవు, కిరాయిరౌడీలు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, శుభలేఖ, పట్నం వచ్చిన పతివ్రతలు, బిల్లా రంగా, పల్లెటూరి మొనగాడు, అభిలాష, గూఢచారి నెం.1, మగమహారాజు’ వంటి చిత్రాలతో న‌టుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ విజయకేతనం ఎగరవేశారు. ప్రేక్ష‌కుల హృదయాల్లో త‌న‌దైన స్థానం సంపాదించుకున్నారు. అయితే ఖైదీ చిత్రం చిరంజీవిని స్టార్‌ హీరోగా మార్చి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసింది.

సుప్రీమ్‌ హీరోగా సినిమా కలెక్షన్స్‌ ప్రభంజనం. ఈ సినిమా నుంచి తెలుగు సినిమా పరుగులు తీసింది. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న గొప్ప న‌టీన‌టుల‌ను మించి ఆక‌ట్టుకోవాలంటే ఏదైనా కొత్తదనం తనలో ఉండాలి అని నిర్ణ‌యించుకున్నారు. ఆ క్ర‌మంలో ఆయ‌న యాక్షన్‌, డాన్సులు న్యూ ట్రెండ్‌గా మార్చారు. తర్వాత ‘మంత్రిగారి వియ్యంకుడు, సంఘర్షణ, గూండా, ఛాలెంజ్‌, ఇంటిగుట్టు, చట్టంతో పోరాటం, దొంగ’ ‘అడవి దొంగ’ వంటి కమర్షియల్ హిట్స్ చిరంజీవి సొంతం. ‘విజేత, కొండవీటి రాజా, మగధీరుడు, చంటబ్బాయ్‌, రాక్షసుడు, దొంగమొగుడు’ చిత్రాలు చిరంజీవి స్టార్‌ ఇమేజ్‌ని పెంచుకుంటూ వచ్చాయి. ‘పసివాడి ప్రాణం’ సంచలన విజయం చిరంజీవి రేంజ్ ని మరింత పెంచింది.

‘స్వయంకృషి’తో ఉత్తమ నటుడు అవార్డు అందుకొని ‘మంచిదొంగ’తో కమర్షియల్‌ సక్సెస్‌ కొట్టి, ‘రుద్రవీణ’ని సొంత నిర్మాణంలో రూపొందించి జాతీయస్థాయిలో అవార్డు అందుకున్న సుప్రీమ్‌ హీరో. ‘యముడికి మొగుడు’తో మరో రికార్డు సృష్టించారు. ‘ఖైదీ నెంబర్‌ 786‘ తర్వాత ‘మరణ మృదంగం’తో మెగాస్టార్‌ అయ్యారు. ‘త్రినేత్రుడు’ 100వ చిత్రంగా అభిమానులను అలరించారు. ‘స్టేట్‌రౌడి, కొండవీటి దొంగ’ జగదేకవీరుడు అతిలోక సుందరి’ చిత్రంతో బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాసి ఇండస్ట్రీ హిట్‌ సాధించారు.

Chiranjeevi – Savitri : సావిత్రి ముందు డ్యాన్స్ చేస్తూ జారి కిందపడిపోయిన చిరంజీవి.. అయినా ఆగకుండా..

గ్యాంగ్‌లీడర్‌, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు’ ఇలా ఒకదాన్ని మించిన మరొక బ్లాక్‌ బస్టర్‌ని ఇచ్చి హ్యాట్రిక్‌ సాధించడమే కాదు.. ‘ఘరానా మొగుడు’తో తెలుగు సినిమా సువర్ణ అక్షరాలు రాసింది. అన్ని రోజులు, అన్నివేళలా చిరంజీవికి హిట్స్ వడ్డించిన విస్తరి కాలేదు. చిరంజీవి పని అయిపోయింది.. అని అనుకున్న టైంలో హిట్లర్ గా వచ్చి ఒక ఊపు ఊపేశారు. ఆరుగురు చెల్లెళ్ల బాధ్యతతో మొండిగా మారిన అన్న పాత్రలో ఆయన నటన అద్భుతమనే చెప్పాలి. తన బ్లాక్‌బస్టర్‌ ట్రాక్‌ను కంటిన్యూ చేస్తూ.. ‘హిట్లర్‌, మాస్టర్‌, బావగారూ బాగున్నారా, చూడాలని వుంది, స్నేహం కోసం, అన్నయ్య, ఇద్దరు మిత్రులు, శ్రీమంజునాథ’ వంటి వరుస మెగా హిట్స్‌.

శ్రీమంజునాథ చిత్రంలో శివుడిగా పౌరాణిక పాత్రలో కనిపించారు. ‘ఇంద్ర’తో తన రికార్డుల్ని తనే బ్రేక్ చేసుకోవడమే కాకుండా.. తెలుగు సినిమా రేంజ్‌ని మరింత పెంచారు. ఈ సినిమాలో చిరు నటనతో పాటు డాన్స్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌. తప్పు జరిగింది ఒక్కడి వల్ల కాదు.. లంచగొండితో అని ‘ఠాగూర్’ గా గర్జించారు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం “క్షమించడం” అని డైలాగ్ చెప్తున్నప్పుడు జనం గోలలు, ఈలలు విని ఇది కదా కావాల్సింది అసలైన మాస్ మసాలా. ‘శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్‌’తో మరో బిగ్గెస్ట్ ఎవర్‌గ్రీన్‌ హిట్. ‘స్టాలిన్‌’తో హిట్‌ కొట్టి మెగాస్టార్‌ చిరంజీవి ‘శంకర్‌దాదా జిందాబాద్‌’ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేశారు.

ప్రజల కోసం ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. కానీ ఆయన ఆశించిన ఫలితం రాకపోయినా తెలుగు సినిమా ఎప్పటికీ మర్చిపోదు. తొమ్మిదేళ్ల గ్యాప్‌ తర్వాత చిరంజీవి ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చి.. ఇప్పటి ట్రెండ్‌కి తగ్గ సినిమాలు చేస్తున్నారు. ఎప్పటిలాగే బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ను కొల్లగొట్టడం. చిరంజీవి అంటే డ్యాన్సులు, ఫైట్స్‌కే ట్రేడ్‌ మార్క్. ఈతరం యువ హీరోలందరూ డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లో రాణిస్తున్నా.. తనదైన స్టైల్ తో దూసుకుపోతున్నారు. అయితే చిరంజీవి బాక్సాఫీస్‌ దగ్గర చిరంజీవుడే అంటూ తన ల్యాండ్‌ మార్క్‌ 150వ చిత్రం ఖైదీ నంబర్‌ 150తో మరోసారి తన సత్తా చాటారు.

Chiranjeevi : ఆ నిర్మాత తిట్టడం వల్లే నాలో కసి పెరిగింది..

కొడుకు రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ హౌస్ లో ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి క‌థ‌తో తెరకెక్కించిన ‘సైరా న‌ర‌సింహారెడ్డి’ మూవీలో చిరంజీవి నటించి మెప్పించారు. ‘ఆచార్య’ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న చిరంజీవి.. యంగ్ హీరోలకి సైతం ఝలక్ ఇచ్చేలా వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సైన్ చేస్తున్నారు. మలయాళం మూవీ రీమేక్ అయిన మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన గాడ్ ఫాద‌ర్ ద‌స‌రాకు రిలీజై సూపర్ హిట్ అందుకుంది. అలాగే యంగ్ డైరెక్ట‌ర్ బాబీతో వాల్తేరు వీరయ్య మాస్ క‌మ‌ర్షియ‌ల్ మూవీ ఈ సంక్రాంతి బరిలో తన సత్తా చాటింది.

మరోవైపు మెహ‌ర్ ర‌మేష్ దర్శ‌క‌త్వంలో రూపొందుతున్న భోళా శంక‌ర్‌.. ఆగస్ట్ 19న విడుదల కానుంది. ఇవేకాకుండా యంగ్ డైరెక్టర్స్ కళ్యాణ్ కృష్ణ, వశిష్ఠ తో క్రేజీ ప్రాజెక్ట్స్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు మెగాస్టార్. అయితే కేవలం ఫంక్షన్స్‌, కటౌట్స్‌, క్షీరాభిషేకాలకు మాత్రమే పరిమితం కాకుండా అభిమానులను సేవా కార్యక్రమాల వైపు నడిపించారు. మదర్‌ థెరిస్సా స్ఫూర్తితో చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ను 1998 అక్టోబర్‌ 2న స్టార్ట్‌ చేశారు. నేత్రదానంతో వేలమంది జీవితాల్లో వెలుగులు నింపి, లక్షల మందికి రక్తాన్ని అందించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ బెస్ట్‌ వాలంటీర్‌ సర్వీస్‌ అవార్డును ఈ ట్రస్ట్‌ ఎన్నోసార్లు గెలుచుకోవడం విశేషం.

ప్రపంచ సినీ చరిత్రలో ఇలాంటి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టడమే కాదు.. దాన్ని సక్సెస్‌ఫుల్‌గా ఆచరణలో పెట్టిన ఘనత మాత్రం మెగాస్టార్‌ చిరంజీవిదే. ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోన్న చిరంజీవి.. క‌రోనా కష్టకాలంలో సినీ ఇండ‌స్ట్రీకి పెద్దదిక్కుగా నిలిచారు. క‌రోనా స‌మ‌యంలో సినిమా థియేటర్స్‌ మూతపడ్డాయి. షూటింగ్స్‌ ఆగిపోయాయి. సినీ కార్మికులు అనేక ఇబ్బందులు పడ్డారు. సినీ కార్మికుల కష్టాలను గుర్తించిన చిరంజీవి.. ఇండస్ట్రీ పెద్దలతో మాట్లాడి, కార్మికుల సంక్షేమార్థం చిరంజీవి అధ్యక్షతన ‘సీసీసీ మనకోసం’ సంస్థను ఏర్పాటు చేశారు.

Chiranjeevi : పాన్ ఇండియా మూవీ రిజెక్ట్ చేసిన మెగాస్టార్..

ఈ సంస్థకు విరాళాలు ఇవ్వాలంటూ చిరంజీవి ఇచ్చిన పిలుపుతో ఇండస్ట్రీలో స్టార్‌ హీరోలతో పాటు, చిన్నాచితకా ఆర్టిస్టులు కూడా తమవంతు సాయం చేశారు. ఈ విరాళాలతో 15 వేలకు పైగా కుటుంబాలకు రెండు, మూడు నెల‌ల పాటు కావాల్సిన నిత్యవసరాలు అందించారు. అలాగే ఇప్పుడు సినీ కార్మికుల కోసం త‌న తండ్రి పేరుతో ఓ హాస్పిట‌ల్‌ను నిర్మించ‌బోతున్నారయన. త‌న‌ను ఈ స్థాయిలో నిల‌బెట్టిన సినీ ఇండ‌స్ట్రీకి, తెలుగు ప్రేక్ష‌కుల‌కు అవసరమైన ప్ర‌తీసారి మెగాస్టార్ చిరంజీవి ఏదో ఓ ర‌కంగా కృతఙ్ఞతలు తెలిపే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నారు.

By Meena Rathna Kumari

I'm Meena, Meena Rathna Kumari, a passionate writer of love, romantic, and fiction stories. 📚✍️ Dreaming to be a film maker one day! 🎥 I'm a movie enthusiast and bookworm, always seeking inspiration. Check out my website at http://ramulamma.com/author/meena-rathna-kumari/ for more of my work. Don't forget to follow me on Facebook at https://www.facebook.com/MeenaRathnaKumari/ and Instagram at https://www.instagram.com/meena_rathna_kumari/ to stay updated! Join me on this incredible journey. 🎬 #mrkmeena #writerlife #filmlover

Related Post