Thangalaan Movie Review : విక్రమ్ కష్టం ఫలించిందా..

Thangalaan Movie Review : విక్రమ్ హీరోగా వచ్చిన సినిమాలు, బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ అందుకుని చాలా ఏళ్లు అయ్యింది. ప్రయోగాల పేరుతో కెరీర్‌ని, క్రేజ్‌ని నాశనం చేసుకున్నాడు విక్రమ్. విక్రమ్ చేసిన మరో ప్రయోగం ‘తంగలాన్’. పా. రంజిత్ దర్శకత్వంలో వచ్చిన ‘తంగలాన్’ మూవీ ఎలాం ఉంది.. ఈసారి అయినా విక్రమ్‌కి హిట్టు దక్కిందా…

200 ఏళ్ల క్రితం బ్రిటీష్ వాళ్లు, ఇండియాకి వచ్చిన సమయంలో జరిగిన కథతో తెరకెక్కింది ‘తంగలాన్’. కేజీఎఫ్ బంగారు గనుల చరిత్రకు కాస్త ఫాంటసీని జోడించి ‘తంగలాన్’ మూవీని తీశాడు రంజిత్. బంగారు గని గురించి తెలుసుకున్న బ్రిటీష్ వాళ్లు, దాన్ని తవ్వేందుకు విశ్వప్రయత్నాలు చేసినా సక్సెస్ కాలేరు. దీంతో తంగలాన్‌ని సాయం కోరతాడు. అతను వారికి ఎలా సాయం చేశాడనేదే ‘తంగలాన్’ మూవీ కథ..

విక్రమ్ తన గెటప్స్, నటనతో మెస్మరైజ్ చేశాడు. మాళవిక మోహనన్, పార్వతి తమ టాలెంట్ చూపించారు. తాను రాసుకున్న సీరియస్ కథాంశాన్ని, అంతే సీరియస్‌గా తెరకెక్కించడంలో డైరెక్టర్ రంజిత్ సక్సెస్ అయ్యాడు. అయితే రంజిత్ సినిమాల్లో ఉండే లాగ్, ఇందులోనూ ఉంటుంది.. కొన్ని సాగతీత సన్నివేశాలు మినహాయిస్తే జీవీ ప్రకాశ్ ఇచ్చిన మ్యూజిక్, అద్భుతమైన నటన కలగలిపిన ‘తంగలాన్’ మూవీ.. థియేటర్లలో కచ్ఛితంగా చూడాల్సిన ప్రయోగమే..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post