Dhanush : తమిళ స్టార్ హీరో, సింగర్ ధనుష్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. సార్ మూవీతో డైరెక్ట్ తెలుగు మూవీ చేసిన ధనుష్. తాజాగా రాయన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి డైరెక్టర్ కూడా ధనుష్ కావడం గమనార్హం. ఈ మూవీ మిక్స్డ్ రిజల్ట్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా తాజాగా ధనుష్ 150 కోట్లు పెట్టి పోయిస్ గార్డెన్స్ దగ్గర ఒక ఇల్లు కొన్నాడు.
సూపర్ స్టార్స్ కీ, సినిమా హీరోలకీ ఇది చాలా నార్మల్ విషయమే. కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడిగా మాత్రమే అతన్ని ఎప్పుడూ చూసే కొంతమందికి ఇది మింగుడు పడడం లేదు. 150 కోట్లు పెట్టి ఇల్లు కొనడాన్ని అహంకారంగా చూస్తున్నారు.
Dhanush Kubera : అండర్ వరల్డ్‌ని శాసించే బిక్షగాడి కథతో కుబేరా..
అయితే ధనుష్ టీనేజ్ ఉన్నప్పుడు 16 ఏళ్ళ ప్రాయంలో తన స్నేహితుడితో కలిసి చెన్నై రోడ్ల మీద వెళ్తున్నప్పుడు రజనీకాంత్ ఇల్లునీ మొదటిసారి చూసి ఫిదా అయ్యాడట. అలాంటి లొకేషన్ లో అలాంటి మంచి ఖరీదైన అందమైన ఇల్లు నిర్మించుకోవాలనిఅనుకున్నాడట. ఆ కల నెరవేరడానికి ధనుష్ కి 24 ఏళ్ళు పట్టింది.
తన కొత్త సినిమా ‘రాయన్’ విడుదల సందర్భంగా ఆ ఇల్లు కొన్నాడని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. దీనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు ధనుష్. “వీధులలో తిరిగే కుర్రాడు ఇంకా వీధులోనే ఉండాలా? చిన్న అపార్మెంట్ కొనుక్కొని ఉండలాంటారా, నాలాంటి స్టార్ ఇల్లు కొనకూడదు అంటారా? అంటూ బదుఇచ్చాడు.
Dhanush : ఇళయరాజా బయోపిక్‌లో ధనుష్..
తన మామకి ధీటుగా అదే ఏరియాలో 150 కోట్లతో ఇల్లు నిర్మించుకున్నాడు ధనుష్. ప్రస్తుతం ధనుష్ కి హిందీలో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. అంటే అది కేవలం తన ప్రతిభను చూసి వస్తున్నాయి. ధనుష్ పాటలను చాలామంది అభిమానిస్తున్నారు అంటే అది అతని గాత్రం బట్టి కానీ రజనీ లాంటి మామా ఉన్నందుకు కాదు. రజినీ అల్లుడు అయినందుకు కాదు అని ధనుష్ ని సమర్ధిస్తున్నారు కొంతమంది నెటిజన్స్.
Credit: Chaitanya K K