Purushothamudu Movie Review : ప్రస్తుతం ప్రియురాలిని ఛీట్ చేసిన కేసులో ఇరుక్కుని, వార్తల్లో నిలిచిన హీరో రాజ్ తరుణ్, సైలెంట్‌గా ‘పురుషోత్తముడు’ అనే సినిమాని రిలీజ్ చేశాడు. రామ్ భీమన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఓ పాట, యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మరి కష్టాల్లో ఉన్న రాజ్ తరుణ్‌కి ‘పురుషోత్తముడు’మూవీ సక్సెస్ ఇచ్చినట్టేనా..
మల్టీ మిలియనీర్ అయిన రాజ్ తరుణ్, ఓ ఊర్లో సాధారణ రైతులా వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అతను అలా వ్యవసాయం చేయడానికి కారణం ఏంటి? వాళ్ల కుటుంబంలో ఉన్న తగాదాలు ఏంటి? ఆ తగాదాలకు ఆ ఊరికి ఉన్న సంబంధం ఏంటి? ఇదే ‘పురుషోత్తముడు’ సినిమా సింగిల్ లైన్ స్టోరీ..
గోపి సుందర్ సంగీతం అందించిన ఈ సినిమాలో రైతుల మీద సాగే ఓ పాట మెప్పిస్తుంది. అలాగే ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ వంటి నటులను తీసుకున్న దర్శకుడు, వారికి బలమైన పాత్రలను మాత్రం రాయలేకపోయాడు. హీరో రాజ్ తరుణ్ డ్రెస్సింగ్ స్టైల్, వాకింగ్ స్టైల్ ఇలా చాలా వాటిల్లో మహేష్ బాబు ‘మహర్షి’సినిమా లుక్స్ గుర్తుకువస్తాయి..
భారీ తారాగణం ఉన్నప్పటికీ చాలామంది నటనలో ఓవరాక్షన్ కనిపిస్తుంది. హీరోయిన్ హాసినిని గ్లామర్ కోసమే పెట్టుకున్నట్టుగా ఉంటుంది. ఆమెకు నటనలో అ, ఆ లు కూడా నేర్పించలేకపోయాడు డైరెక్టర్. ఫైట్స్‌లో, యాక్షన్ సీన్స్‌లో నటిస్తున్నారని చూసే ప్రేక్షకులకు తెలిసిపోతూ ఉంటుంది.. మూవీ స్టార్టింగ్‌లో ఏదో మెసేజ్ ఇవ్వబోతున్నాడనే ఆసక్తి క్రియేట్ అవుతుంది. అయితే కథ ముందుకు వెళ్లే కొద్దీ సాగే సీన్స్… ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి.
చాలా రోజుల తర్వాత శక్తి మాన్ సీరియల్ ఫేమ్ ముఖేష్ ఖన్నా నటించిన తెలుగు సినిమా ఇది. అలాగే బ్రహ్మానందం, కౌసల్య వంటి సీనియర్ నటులు ఉన్నారు. కానీ అటు కామెడీ కానీ, ఇటు సీరియస్ కథ కానీ లేకపోవడం వల్లే ఎక్కడో మొదలై, ఇంకెక్కడో వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. మొత్తానికి రాజ్ తరుణ్ కష్టాలను పురుషోత్తముడు కాపాడలేకపోయాడు.