38 భాషల్లో సూర్య ‘కంగువా’ మూవీ.. త్రీడీలో కూడా..

Suriya Kanguva movie : సూర్య నటిస్తున్న 39వ సినిమా ‘కంగువా: A mighty Valiant Saga’. ‘వీరం’, ‘వేదాలం’, ‘వివేగం’, ‘విశ్వాసం’, ‘అన్నాట్టే’ వంటి రొటీన్ మాస్ మసాలా సినిమాలు తీసిన డైరెక్టర్ శివ, తొలిసారిగా ఈ చారిత్రక యుద్ధ గాథను తెరకెక్కిస్తున్నాడు. చోళ రాజ్యాన్ని పాలించిన ఓ రాజు కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.

రికార్డులు దున్నేందుకు ‘సలార్’ మాస్టర్ ప్లాన్.. ఒక్క కర్ణాటకలోనూ వెయ్యికి పైగా థియేటర్లు..

దిశా పటానీ, బాబీ డియోల్, జగపతి బాబు, యోగి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ‘కంగువా’ మూవీలో సూర్య ఏకంగా ఆరు పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఈ ఆరు పాత్రల్లో 13 డిఫరెంట్ లుక్స్‌లో సూర్య కనిపిస్తాడు. 2024 ఏప్రిల్ 11న ఈ సినిమాని రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

Surya Kanguva movie

దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘కంగువా’ మూవీని ప్రపంచవ్యాప్తంగా 38 భాషల్లో విడుదల చేయబోతున్నట్టు నిర్మాత జ్ఞానవేళ్ రాజా ప్రకటించాడు.

రూ.100 కోట్లకు తగ్గేదిలే! స్టార్ హీరోల సినిమాలకు ఫుల్లు డిమాండ్..

తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్‌తో పాటు స్పానిష్, చైనీస్ వంటి ప్రపంచ భాషల్లోనే ఒకేసారి సినిమాని రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించిన జ్ఞానవేళ్ రాజా, త్రీడీ ఫార్మాట్‌తో పాటు ఐమాక్స్‌ ప్రింట్ కూడా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించాడు.

ఇప్పటికే ఈ సినిమా రైట్స్‌ని రూ.500 కోట్లకు అమ్మేశారు. తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో డిజిటల్ రైట్స్‌ని రూ.80 కోట్లకు విక్రయించగా హిందీ రైట్స్‌ని రూ.100 కోట్లకు అమ్మేశాయి. డిజిటల్ రైట్స్‌ని అమెజాన్ ప్రైమ్ ఇండియా రూ.80 కోట్లకు కొనుగోలు చేసింది.

నాని సరిపోదా శనివారం, ఆ ఫేమస్ నవలకు కాపీనా? టైటిల్‌తో సహా అన్ని లేపేశాడా..!?

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post