Leo OTT Release : ఓటీటీలోకి లియో.. ఇక్కడే అసలు ట్విస్ట్..

Leo OTT Release : తమిళ హీరో ‘తలపతి’ విజయ్‍కు క్రేజ్ మామూలుగా ఉండదు. తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత.. ఆ స్థాయిలో మాస్ ఫాలోయింగ్ సంపాదించిన హీరోల్లో దళపతి విజయ్ ముందు వరుసలో ఉంటాడు. ప్రెసెంట్ విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ ‘లియో’.

త్రిషను రేప్ చేయాలని అనుకున్నా! ‘లియో’ నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ షాకింగ్ కామెంట్స్..

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర్నుంచి, ఫ్యాన్స్‌లో విపరీతమైన అంచనాలు పెరిగాయి. ‘విక్రమ్’ సినిమాతో ఇండస్ట్రీ హిట్టు కొట్టిన లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) చేస్తున్న ‘లియో’(Leo), అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ కలెక్షన్స్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు.

Leo OTT Release

ఈ మూవీలో విజయ్ సరసన సౌత్ క్వీన్ త్రిష నటించింది. విజయ్, త్రిష 14 ఏళ్ళ విరామం తర్వాత మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే ఈ మూవీలో టాలీవుడ్ నుంచి ఓ స్టార్ హీరో ఉంటాడని ఎప్పటి నుంచో ప్రచారం జరగడంతో.. సర్ప్రైజ్ కోసం థియేటర్ కు వెళ్లిన తెలుగు ప్రేక్షకులకు నిరాశే మిగిలింది.

ఈ మాత్రం దానికి ఇన్ని ఎలివేషన్స్ బొక్క.. ఫైనల్‌లో టీమిండియా చిత్తు! వరల్డ్ కప్ ఆస్ట్రేలియా వశం..

ఇక ఈ మూవీని థియేటర్ లో మిస్ అయినా ఆడియన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. థియేటర్ రిలీజ్ కి ముందే ‘లియో’ డిజిటల్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిస్ సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీకి సంబంధించి రెండు రిలీజ్ డేట్స్ ప్రటించింది నెట్ఫ్లిస్. ఇండియాలో లియో సినిమా న‌వంబ‌ర్ 24న రిలీజ్ కానుండగా.. గ్లోబ‌ల్ వైడ్‌గా మాత్రం లియోని న‌వంబ‌ర్ 28 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ఫ్లిస్ అధికారికంగా ప్రకటించింది.

By UshaRani Seetha

I'm Telugu Content writer with 4 years of Experience. I can write any vertical articles but specialist in Movie Articles and Special Stories

Related Post